Share
  • శమీ పూజకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు!
  • రాజ్యాంగబద్ధమైన పదవికి గౌరవం ఇవ్వాలి..
  • ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్

రేవల్లి, ఏదుల అక్టోబర్ (సింగిడి): విజయదశమి పండుగ సందర్భంగా ఏదుల గ్రామంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమం వివాదానికి దారితీసింది. (Edula Shami Puja Controversy) గ్రామ సర్పంచ్ కాటమోని పరుశురాం యాదవ్‌కు జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన అధికారిక శమీ పూజకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కొందరు ముందుగానే పూజలు నిర్వహించారని ఆరోపిస్తూ పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (Edula Shami Puja Controversy) ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు అధికారిక కార్యక్రమంలో సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

Edula Shami Puja Controversy Edula Shami Puja Controversy

గ్రామంలో ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి ఘటనలు గ్రామ ఐక్యతకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పరుశురాం యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే కొందరు ఆయనను పక్కన పెట్టారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది.

ఏదుల రైతులకు రూ. 25 లక్షలు ఏవి..? ఎమ్మెల్యే మేఘా రెడ్డి: https://site.singidinews.com/mla-megha-reddy-fires-on-brs/

Edula Shami Puja Controversy: విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై ఎంపీడీవో, డీఎల్‌పీవో అధికారులు వెంటనే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్‌తో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్‌కు జరిగినట్లు ఆరోపిస్తున్న అవమానంపై బాధ్యులు స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అమెరికాలోని ప్రతి బిడ్డకు ఫ్రీగా స్పేస్ ఎక్స్ షేర్లు:  https://epaper.singidinews.com/clip/2586

గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌కు తగిన గౌరవం ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవాలు తేలినట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.

Share