- దారి లేక…వరి పొలాల మీదుగానే అంతిమయాత్ర!
- గోపాల్పేట మండలం పోలికేపాడులో హృదయవిదారక ఘటన
- చనిపోయినా కష్టాలే.. బతికున్నా అవస్థలే!
- అధికారులు మానవత్వంతో స్పందించాలని కోరుతున్న గ్రామస్తులు
పోలికేపాడు (Polikepadu)లో దారి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనుషులు అవస్థలు పడటం సహజమే కానీ లో మాత్రం జీవం లేని శవాలు కూడా దారి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 14 (సింగిడి): మనిషి బతికున్నప్పుడు ఎదురయ్యే కష్టాలు ఒక ఎత్తయితే.. మరణించిన తర్వాత అంతిమయాత్రకు సైతం సరైన దారి లేకపోవడం మరో ఎత్తు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పోలికేపాడు (Polikepadu) గ్రామానికి చెందిన మిద్దె లోకమాత ఐదు రోజుల క్రితం మృతి చెందడంతో ఆమె అంతిమయాత్రకు ఎదురైన దారి సమస్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరి పొలాల మీదుగా పాడెను మోసుకెళ్లాల్సిన పరిస్థితి హృదయాలను కలచివేస్తోంది.

నిబంధనలకు నీళ్లొదిలారు: https://site.singidinews.com/narsampet-illegal-construction/
గ్రామం నుంచి రంగ చెరువు కట్ట వరకు మాత్రమే బండి బాట
రంగ చెరువు కట్ట నుంచి తెలుగోని భావి వరకు బాటలేదు. ఆ ప్రాంతంలో దాదాపు 95 ఎకరాల వరి సాగు అవుతుంది. ఆ పొలాల రైతు కుటుంబాలు 30 దాకా ఉన్నాయి. వారు చనిపోతే ఆ ప్రాంతానికే తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో నక్ష బాట ఉందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. తెలుగోని బావి ప్రాంతానికి వెళ్లాలంటే సరైన దారి సౌకర్యం లేకపోవడంతో అంతిమయాత్రలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే మార్గంలో రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం యూరియా సంచులను మోసుకెళ్లాల్సి వస్తోంది. గెట్ల మీదుగా సంచులను తీసుకెళ్లడం, పొలాల మధ్య నడవడం రైతులకు నిత్యకృత్యంగా మారిన పరిస్థితి ఏర్పడింది. సంచులను తీసుకెళ్లే క్రమంలో క్రింద పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.
‘మోదీ, షా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు’: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/766
Polikepaduలో గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలేడ?

చనిపోయిన వ్యక్తికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన బాధ్యత. ఇప్పటికే ఆత్మీయురాలిని కోల్పోయిన కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖంలో ఉంటే చివరి ప్రయాణానికి కూడా దారి కష్టాలు ఎదురుకావడం వారి బాధను మరింత పెంచుతుంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల కనీస అవసరాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. పోలికేపాడు గ్రామంలోని సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల రాకపోకలకు, అంతిమయాత్రలకు ఇబ్బందులు కలగకుండా తగిన మార్గాన్ని గుర్తించి అవసరమైన అనుమతులు, భూముల హద్దులు, సంబంధిత అంశాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
Polikepadu: ఇద్దరికీ దారి కావాలి
బతికున్న రైతుకు పొలానికి వెళ్లే దారి కావాలి.. మరణించిన మనిషికి గౌరవంగా వీడ్కోలు పలికే మార్గం కావాలి. ఇది కేవలం రహదారి సమస్య మాత్రమే కాదు.. మానవత్వానికి సంబంధించిన అంశం. మిద్దె లోకమాత అంతిమయాత్ర సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గ్రామస్థుల ఇబ్బందులకు ముగింపు పలకాలని వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.














