Share
  • బుద్దారం నిర్వాసితుల పరిహారంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నిలదీత
  • కొడంగల్‌కు ఒక న్యాయం.. వనపర్తి రైతులకు మరో న్యాయమా?

గోపాల్‌పేట, అక్టోబర్ 10 (సింగిడి): ఇప్పుడు Kodangal VS Wanaparthy అనే నినాదం మొదలైంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.12 లక్షలకే పరిమితం చేయడం ఏమిటి? హామీ నెరవేర్చకపోతే 20 అడుగుల గుంత తీసి తనను బొంద పెట్టాలని సవాల్ చేసిన నాయకుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలో పెద్ద చెరువు భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. నిర్వాసితుల పోరాటానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. Kodangal VS Wanaparthy అంటూ కొత్త అంశం తెరపైకి వచ్చింది.

బుద్దారం నిర్వాసితుల పోరుబాట: https://site.singidinews.com/buddharam-farmers-protest/

Kodangal VS Wanaparthy Kodangal VS Wanaparthy

210 ఎకరాలు ముంపు.. హామీలు మాత్రం నీటిపాలు!

పెద్ద చెరువు ముంపు కారణంగా మొత్తం 210 ఎకరాల భూమి ప్రభావితమవుతోందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందులో పాత ముంపు కింద 110 ఎకరాలు, కొత్త రిజర్వాయర్‌లో భాగంగా మరో 101 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల క్రితం ఎకరాకు రూ.12 లక్షల పరిహారంతో పాటు దళితులకు దళితబంధు, బీసీలకు బీసీబంధు, ఇతరులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఎకరాకు రూ.25 లక్షలు ఇప్పిస్తానని, ఇవ్వకపోతే 20 అడుగుల గుంత తీసి తనను బొంద పెట్టాలని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు మళ్లీ రూ.12 లక్షల పరిహారం అంటున్నారని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఫాఫం ట్రంప్ ఈ ‘సారీ’ నిరాశే: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/755

Kodangal VS Wanaparthy Kodangal VS Wanaparthy

Kodangal VS Wanaparthy: వారికి ఓ న్యాయం.. వీరికి మరో న్యాయమా?

కొడంగల్ నిర్వాసితులకు ఒక రకమైన పరిహారం, వనపర్తి జిల్లా నిర్వాసితులకు మరో రకమైన పరిహారం ఎలా ఇస్తారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలికేపాడు శివారులోని ప్రభుత్వ భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేనందున, నిర్వాసితులకు ఒక ఎకరానికి బదులుగా మూడు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎకరాకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. నిర్వాసితులు అధైర్యపడవద్దని, వారి తరఫున న్యాయపోరాటం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Share