- మహిళా ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (సింగిడి): మహిళా ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యంలో చీకటి రోజని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి Niranjan Reddy అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని మహిళల చేత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని Niranjan Reddy డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని, అసెంబ్లీ సాక్షిగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని అన్నారు.అక్రమంగా అరెస్టు చేసిన ఎం.ఎల్. సిలు తాత మధు, నవీన్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని Niranjan Reddy కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు 100 రోజులలో అమలు చేస్తామని మాట తప్పినందుకు నల్ల దుస్తులతో నిరసన వ్యక్తం చేయడానికి అసెంబ్లీకి వెళుతున్న ఎమ్మెల్యేలపై, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు.
పోలీస్ అభ్యర్థులకు శుభవార్త: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
రాహుల్, ప్రియాంకకో న్యాయం.. మాకో న్యాయమా: Niranjan Reddy
రాజ్యాంగ పుస్తానికాన్ని చేతపట్టుకొని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పార్లమెంట్ లో నిరసన తెలియజేయవచ్చు కానీ మేము చేస్తే తప్పా అని నిలదీశారు. ఎమ్మెల్యేలను సభలోకి రానీయకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షం సభలో ప్రభుత్వ బండారం బయట పెడుతుందని జడిసి సభ బయటనే అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను, రెండు సార్లు మంత్రులుగా చేసిన అనుభవం ఉన్నా అవమానించిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని, వెంటనే రేవంత్ ప్రభుత్వం మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ నిత్యం మహిళా పక్షపాతి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మహిళల ఉసురు తగిలి పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.ప్రజల నుండి వస్తున్న నిరసనలు తట్టుకోలేక రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య ఖూనికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు: https://site.singidinews.com/vadagudem-sand-quarry-elections/















