Share
  • చంద్రబాబు జలచౌర్యం .. నోరు మెదపని బానిస రేవంత్
  • తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్
  • అవగాహన రాహిత్యంతో నిరాధార ఆరోపణలు చేస్తే తాటతీస్తాం
  • రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, ఆగస్టు 31 (సింగిడి): చంద్రబాబు నాయుడు జల చౌర్యానికి పాల్పడుతుంటే బానిస రేవంత్ రెడ్డి సర్కార్ నోరు మెదపడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి, పాలమూరు జిల్లాకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలు, మన నీటి వాటా, కృష్ణ, గోదావరి జలాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల హక్కులపై వైట్ బోర్డుపై డయాగ్రమ్ వేసి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద జలాలే లక్ష్యంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణమని, వాడుకుంటుంది మాత్రం నికర జలాలని అన్నారు. కృష్ణా నికరజలాలు ఏదెచ్చగా వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు జలచౌర్యం చేస్తున్న బానిస రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోకపోవడం తెలంగాణకు దుర్దినమని రేవంత్ పై నిప్పులు చెరిగారు. మొదటి నుండి కాంగ్రెస్ తెలంగాణ సాగునీటి విషయంలో ప్రధాన శత్రువుగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.

బాబు యథేచ్ఛగా నీటి దోపిడీ చేస్తున్నడు: Niranjan Reddy

వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం కృష్ణా వరద జలాలు మాత్రమే వాడుకొనే నిబంధన ఉన్నపటికీ మోదీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వ బానిస పోకడలు ఆసరాగా చేసుకొని చంద్రబాబు యథేచ్ఛగా జలాలు దోచుకుపోతున్నా రేవంత్ రెడ్డి నోరు మెదకపోవడం తెలంగాణకు శాపంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రతి చుక్క ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ వచ్చిన మూడేండ్లలో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా తపన భావితరాల భవిష్యత్తు కోసం సాగిందని, నేటి కాంగ్రెస్ తపన కేవలం ఆంధ్రా ప్రయోజనాలకు పరిమితం అయిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని, రోజు రెండు టీఎంసీలు ఎత్తిపోసేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను నిర్మించామని పేర్కొన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆలస్యానికి కాంగ్రెస్ నాయకులే కారణమని,
రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని వివరించారు. పంపింగ్ స్టేషన్లు, 4 రిజర్వాయర్, టన్నెల్ లు, నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.

2023లోనే 90శాతం పూర్తి..

Niranjan Reddy

2023 లోనే ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని వెల్లడించారు. రెండున్నర ఏండ్ల తరువాత సీఎం ప్రాజెక్టు విజిట్ చేశారని, సమీక్ష లేదు..ఇంజినీర్లకు ఆదేశాలు లేవని, నార్లపూర్, ఏదుల లింక్ కెనాల్ లో మిగిలిన పనులు పూర్తి చేయలేదని చెప్పారు.

అన్ని రిజర్వాయర్ ల కట్టల పొడవు 120 కిలోమీటర్లని, పంపింగ్ కు సంబంధించి మేజర్ పనులు పూర్తి చేశామని, కాలువలు తవ్వి నీళ్ళు ఇవ్వడం సెకండ్ ఫేజ్ అని చెప్పారు.నీళ్ళు పంపింగ్ చేస్తే పాలమూరు జిల్లాలో యాబై టీ ఏం సి ల నీళ్ళు నిల్వ ఉండేవని, కేసీఆర్ పెండింగ్ పెడితే తొంభై శాతం పనులు ఎట్లా పూర్తి అయ్యాయని ఆయన ప్రశ్నించారు.

27 వేల ఎకరాల భూసేకరణ చేశాం

27 వేల ఎకరాలు భూసేకరణ చేశామని, 802 అడుగుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను డిజైన్ చేశామని,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆలస్యం అయితే ఆంధ్రాకు ప్రయోజనం చేకూరుతుందని, అందుకే ప్రాజెక్టు పూర్తి చేయకుండా పనులు పెండింగ్ లో పెట్టారని వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతలతో రోజుకి 0.2 టీ ఏం సి నీళ్ళు మాత్రమే ఎత్తిపోయగలమని, ఏపీకి రోజుకి పదకొండు టీ ఏం సి నీళ్ళు తీసుకుపోతున్నారని, మన వైపు ఉన్న పంప్ లు నడపమంటే చేతకావట్లేదని, జూరాల కు వరద వచ్చి కిందకుపోతుంటే ఎత్తిపోయలేదని చెప్పారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో సంవత్సరం మొత్తం నలభై టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయగలమని, 1983 లో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ ఎల్ బి సి నుండి నాలుగు లక్షల ఎకరాలకు పారించాలని డిజైన్ చేశారన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఎస్ ఎల్ బి సి పనులు చేపడితే కుప్పకూలి… కొంతమంది ప్రాణాలు పోతే శవాలు కూడా తీయలేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పనులు తొమ్మిది కిలోమీటర్ల దూరం పనులు బీఆర్ఎస్ పూర్తి చేసిందని, వెలుగొండ ప్రాజెక్టు కోసం 39 కిలోమీటర్ల టన్నెల్ పనులు ఏపీ చేపట్టి పూర్తి చేసిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఎందుకు పూర్తి చేయలేకపోతుంది.  ఏపీ ఎందుకు చేయగలిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బానిస మనస్త్వత్వం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. పోతిరెడ్డిపాడును కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినప్పటికీ కేసీఆర్ వ్యతిరేకించారని, అందుకే రాజీనామా చేసి కోట్లాడారని Niranjan Reddy గుర్తు చేశారు.

పీజేఆర్ ఒక్కరే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు: Niranjan Reddy

Niranjan Reddy

పీజేఆర్ ఒక్కరే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆనాడు ఎవరు సపోర్ట్ చేయలేదని, ఏపీ కృష్ణా నీళ్ల నిల్వ కోసం 235 టీ ఏం సి ల రిజర్వాయర్ లు నిర్మాణం చేసిందన్నారు. 68 శాతం రివర్ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉందని, వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా 53 టీ ఏం సి నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. 14 ఏండ్లు నీళ్ల కోసం కోట్లాడినపుడు మీరంతా ఎక్కడ ఉన్నారని, ఆంధ్రా సర్కార్ బూట్లు నాకడం మీ పని అని, బానిసత్వం చేస్తూ తెలంగాణ నీళ్ల హక్కుల గురించి పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

ఏపీ కి రేవంత్ సర్కార్ కట్టు బానిసగా ఉందని, ఆగి ఉన్న నికర జలాలు తీసుకెళ్లడం జల చౌర్యం అవుతుందని, ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు నికర జలాల మీద ఆధారపడినవేనని అన్నారు.తెలంగాణ సాగునీటి విషయంలో శ్రద్ధ లేని ముఖ్యమంత్రి ఉన్నాడని..నీళ్ల మంత్రికి అసలే అవగాహన లేదని.. ఇదొక దుర్దినమని..ప్రజలకు ఈ అంశం తెలియాలని చెప్పారు.

ప్రశాంత్ రెడ్డి నిన్ను వదల బిడ్డా:  https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

అవగాహన రాహిత్యంతో నిరాధార ఆరోపణలు చేస్తే తాట తీస్తాం: Niranjan Reddy

Niranjan Reddy

నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో ప్రొజెక్టర్ పెట్టుకొని తలాతోక లేని ఆరోపణలు చేస్తే సహించమని, అటువంటి వారి తాట తీస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. 14 ఏండ్లు కడుపు కట్టుకొని కాళ్ళకు బలపం పట్టుకొని తెలంగాణ కోసం కోట్లాడినామని, ఏనాడు చెయ్యి చాపి ఒక్క రూపాయి అడిగింది లేదని, నిప్పులా బ్రతికామని అన్నారు. నా పాలమూరు పచ్చబడటానికి కేసీఆర్ మెప్పించి సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చి చూపించామని ఉద్వేగభరితంగా తెలిపారు. ఇంకా వందరోజుల తర్వాత మా మీద ఆరోపణలు చేస్తున్న ఒక్కోక్కరికీ రాజకీయ సమాధి కడతామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వామన్ గౌడ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, కృష్ణా నాయక్, కర్రెస్వామి, వేణుగోపాల్, రాళ్ళ కృష్ణయ్య, సామ్యా నాయక్, దిలీప్ రెడ్డి, రాజశేఖర్, శివరామ్ రెడ్డి, శ్రీకర్ గౌడ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, సునీల్ వాల్మీకి, గులాం ఖాదర్ ఖాన్, బొబ్బిలి ప్రేమ్ కుమార్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, నందిమల్ల సుబ్బు, మంద రాము తదితరులు పాల్గొన్నారు.

గంజాయి అక్రమ రవాణాదారుడి అరెస్ట్:  https://site.singidinews.com/ganja-smuggler-arrest-illegal-transportation/

Share