Share
  • మండల కేంద్రంలో బస్సుల కొరత..
  • కోడేరు, కొల్లాపూర్, వెన్నచర్ల వెళ్లాలంటే నాగపూర్‌కు వెళ్లాల్సిందే!
  •  మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పని ప్రయాణ ఇబ్బందులు..
  • బస్సులను రేవల్లి మీదుగా నడపాలని ప్రజల విజ్ఞప్తి

రేవల్లి అక్టోబర్ (సింగిడి): Revalli Bus Services కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్న భావన కలగకమానదు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో పరిమిత బస్సు సర్వీసులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Revalli Bus Services వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంత మంది స్థానికులు మొత్తుకుంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం రావడం లేదు. ముఖ్యంగా కోడేరు, కొల్లాపూర్, వెన్నచర్ల ప్రాంతాలకు వెళ్లాలంటే రేవల్లి నుంచి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని నాగపూర్ గ్రామానికి వెళ్లి అక్కడ బస్సు ఎక్కాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితి మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

Revalli Bus Services

Revalli Bus Services: పరిమిత బస్సు సర్వీసులతో ప్రయాణికుల ఇబ్బందులు

రేవల్లి నుంచి నాగర్‌కర్నూల్, వనపర్తి మార్గాల్లో బస్సులు తిరుగుతున్నప్పటికీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అనుకూలమైన రవాణా సౌకర్యం అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌కు ఉదయం 5 గంటల నుంచి, హైదరాబాద్ నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక్కో బస్సు సర్వీసు మాత్రమే అందుబాటులో ఉందని వారు చెబుతున్నారు. వైద్య అవసరాలు, ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల కోసం ప్రయాణించే ప్రజలు బస్సుల సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు.

ఆ మగాడిని నేను ఇప్పటి వరకు కలవలేదంటున్న మృణాల్ ఠాకూర్: https://epaper.singidinews.com/view/167/telangana-main/12

Revalli Bus Services: కోడేరు, కొల్లాపూర్ వెళ్లాలంటే నాగపూర్‌కే పరుగులు

రేవల్లి సమీపంలోని నాగపూర్ గ్రామం మీదుగా కోడేరు, కొల్లాపూర్, వెన్నచర్ల వైపు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఆ బస్సులు రేవల్లి మండల కేంద్రం మీదుగా వెళ్లకపోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నాగపూర్‌కు చేరుకుని అక్కడ బస్సు ఎక్కాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో రేవల్లి నుంచి నాగపూర్ వరకు అదనపు ప్రయాణం చేయాల్సి వస్తోంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.మరోవైపు, వనపర్తి జిల్లా కేంద్రం నుంచి తూడుకుర్తి, తలుపునూరు మీదుగా రేవల్లికి కేటాయించిన కొత్త బస్సు సర్వీసు తలుపునూరు వరకే వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ సర్వీసును రేవల్లి వరకు పొడిగిస్తే ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Revalli Bus Services Revalli Bus Services

రేవల్లి బస్టాప్‌లో కనీస సౌకర్యాలు నిల్.. ప్రజల ఇబ్బందులు ఫుల్: https://site.singidinews.com/revalli-bus-stop-facilities/

రేవల్లి మీదుగా బస్సులు నడిపితే ప్రజలకు ఊరట

కోడేరు, కొల్లాపూర్, వెన్నచర్ల వైపు వెళ్లే బస్సులను నాగపూర్ నుంచి రేవల్లి మీదుగా నడిపే అవకాశాలను ఆర్టీసీ అధికారులు పరిశీలించాలని మండల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వనపర్తి నుంచి తలుపునూరు వరకు వస్తున్న బస్సును రేవల్లి వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అలా జరిగితేనే రేవల్లి ప్రజలకు నిజమైన ఊరట

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ప్రయాణ సమయం, అదనపు ఖర్చులు తగ్గడంతో పాటు మండల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

Share