Share
  • గోల్డ్ లోన్ వేలం (ఆక్షన్) జాబితాలోకి వచ్చిన వారే వీరి టార్గెట్
  • కొంతమంది గోల్డ్ లోన్ యాజమాన్యాలతో కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం
  • నిబంధనల ప్రకారం మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఒక్క నోటీసుకే బంగారం వేలంపాటకు వెళుతున్న వైనం
  • వడ్డీ కట్టినా బంగారం వేలంపాటకు పోకుండా ఆగదని బెదిరింపులు
  • వడ్డీతో పాటు అసలు మొత్తం కట్టాల్సిందేనని స్థానిక గోల్డ్ లోన్ యాజమాన్యాల ఒత్తిడి
  • వేలం పాట పేరిట ప్రైవేట్ వ్యక్తులకు బంగారం అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనం….?
  • కష్టపడి సంపాదించుకున్న బంగారం కళ్లముందే అన్యాక్రాంతమవుతుండటంతో లబోదిబోమంటున్న కస్టమర్లు
  • పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు?
  • దందాపై చడీచప్పుడు చేయని వైనం!

నర్సంపేట, నవంబర్ 16 (సింగిడి): Narsampet Gold Danda గురించి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న సామాన్య ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని నర్సంపేట పట్టణంలో ఓ ముఠా నయా దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి (Narsampet Gold Danda). నిబంధనలకు విరుద్ధంగా స్థానిక గోల్డ్ లోన్ సంస్థల యాజమాన్యాలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై కస్టమర్ల బంగారాన్ని కాజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం (Narsampet Gold Danda).

RBI నిబంధనలకు నీళ్లు.. ఒక్క నోటీసుకే వేలం!

సాధారణంగా ఆర్‌బీఐ (RBI) నిబంధనల ప్రకారం, కస్టమర్ బంగారాన్ని వేలం వేయడానికి ముందు సంస్థలు కచ్చితంగా మూడు సార్లు ముందస్తు నోటీసులు జారీ చేసి, కస్టమర్‌కు తగినంత సమయం ఇవ్వాలి. కానీ, నర్సంపేటలోని కొన్ని గోల్డ్ లోన్ సంస్థలు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. కనీసం మూడు నోటీసులు కూడా ఇవ్వకుండా, ఒక్క నోటీసుతోనే బంగారాన్ని వేలం పాట జాబితాలోకి చేరుస్తూ కస్టమర్లకు అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఏ కారణం చేతనైనా వాయిదా దాటిన కస్టమర్ల వివరాలను యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా బయటి వ్యక్తులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత కుర్రాళ్లపై పాక్ మాజీల అక్కసు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/844

Narsampet Gold Danda Narsampet Gold Danda

బెదిరింపులు.. బలవంతపు వసూళ్లు

నోటీసు అందుకుని బంగారం విడిపించుకోవడానికి వెళ్లిన కస్టమర్లకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. “మీరు కేవలం వడ్డీ కట్టినా ప్రయోజనం లేదు.. బంగారం వేలానికి వెళ్లకుండా ఆగదు. వెంటనే అసలు, వడ్డీ మొత్తం కలిపి కట్టాల్సిందే” అంటూ నిర్వాహకులు కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

నర్సంపేటలో నిబంధనలకు నీళ్లు: https://site.singidinews.com/narsampet-illegal-construction/

Narsampet Gold Danda: తెరవెనుక ‘వాటాల’ ఒప్పందం…?

ఒకేసారి పెద్ద మొత్తంలో అసలు కట్టలేని కస్టమర్ల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, బహిరంగ వేలం నిర్వహించకుండానే ప్రైవేట్ వ్యక్తులకు ఆ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారాన్ని కట్టబెట్టి, ఆ తర్వాత వచ్చిన లాభాల్లో గోల్డ్ లోన్ నిర్వాహకులు, దళారులు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

Narsampet Gold Danda

లబోదిబోమంటున్న బాధితులు:

కష్టకాలంలో ఆదుకుంటుందని నమ్మి బంగారం తాకట్టు పెడితే, నిర్వాహకుల మాయాజాలంతో తమ ఆభరణాలు శాశ్వతంగా దూరమవుతున్నాయని కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి నర్సంపేటలోని గోల్డ్ లోన్ సంస్థల కార్యకలాపాలపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Share