- ఆర్టీసీ బస్సుల్లో నవ్విపోయే తీరు
- ఇది ప్యాసింజర్ బస్సా..? కార్గో లారీనా? అని ప్రశ్నలు
- నారాయణపేట డిపో అధికారుల నిర్లక్ష్యం
- హార్ట్ పేషెంట్ తో పాటు మరో ముగ్గురిని జడ్చర్లలో వదిలేసి వెళ్లిన వైనం
- టాప్ పైన టైర్లు.. ఆర్టీసీ ఆదాయానికి తూట్లు
Narayanpet RTC Bus తీరు చూసిన చాలా మంది ఆర్టీసీ తీరుని విమర్శిస్తున్నారు. అసలే ఉచిత బస్సు వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ఎక్కాలంటేనే జంకుతున్నామని చాలా మంది బాహాటంగానే చెబుతున్నారు. దానికి తోడు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అసలే సీట్లు ఉండట్లేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటే.. జనాలను కూర్చోనివ్వకుండా కార్టన్ బాక్సులను సీట్లపై ఉంచి, ప్రయాణికులను నిలబెట్టారు. అసలే ఉచిత బస్సు వల్ల ఇబ్బందులు పడతున్నామని ఆరోపిస్తున్న అనేక మంది ఇది చూసి ఆర్టీసీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
నారాయణపేట, అక్టోబర్ 1 (సింగిడి): ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేర్చడానికా.. లేక పెద్ద పెద్ద పార్సిళ్లను మోయడానికా? అని Narayanpet RTC Busని చూసిన ఎవరికైనా అనుమానం కలగక మానదు. గురువారం నారాయణపేట డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు కూడా ఇదే విధంగా ఫీల్ అయ్యారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7:36కు బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది నరకం చూపించారు. (Narayanpet RTC Bus)
Narayanpet RTC Bus: సీట్లలో మనుషులు కాక.. కార్టన్ బాక్సులు
ఆర్టీసీ యాజమాన్యం వస్తువుల సరఫరా కోసం ప్రత్యేకంగా కార్గో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ Narayanpet RTC Bus, నారాయణపేట డిపో సిబ్బంది మాత్రం ఆ నిబంధనలను బొందపెట్టారు. కార్గో వాహనాల్లో పంపాల్సిన పెద్ద పెద్ద బాక్సులు, కార్టన్ మూటలు, ప్రయాణికులు కూర్చునే సీట్లపైనే పెట్టేశారు. దీంతో ప్రయాణికులు కూర్చోవడానికి సీట్లు లేక, తీవ్ర ఇబ్బందులు పడుతూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది (Narayanpet RTC Bus). అలాగే బస్సు టాప్ పైన టైర్లు దర్శనమిచ్చాయి.
ఆర్టీసీ కార్పొరేషన్ ప్రత్యేకంగా పార్సిల్ కోసం కార్గో వాహనాలను నడిపిస్తూ సంస్థకు ఆదాయం కలిగే మార్గాన్ని ఏర్పాటు చేయగా, కొందరు కక్కుర్తి పడి ప్రయాణికులు ప్రయాణించే బస్సులోనే సరఫరా చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న ప్రయాణికులకు సీట్లు ఇవ్వకుండా, కార్టన్ బాక్సులకు వీఐపీ సీటింగ్ ఇవ్వడం ఆర్టీసీ అధికారుల బాధ్యతారా హిత్యానికి అద్దం పడుతోంది.
ఆసియా గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన మెన్ ఇన్ బ్లూ: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/715

గుండె జబ్బు బాధితుడిని వదిలేసి..
ఇదంతా ఒకత్తయితే ఈ బస్సు కండక్టర్, డ్రైవర్ల నిర్లక్ష్యం మరో ఎత్తు. బస్సు జడ్చర్ల బస్టాండ్‌కు చేరుకోగానే టిఫిన్ కోసం 10 నిమిషాలు ఆగుతుందని కండక్టర్ ప్రయాణికులకు తెలిపాడు. అది నమ్మి ఓ హార్ట్ పేషెంట్‌తో పాటు మరికొందరు టిఫిన్ చేయడానికి దిగారు. తీరా చూస్తే, చెప్పిన సమయం కాకముందే ఆ ప్రయాణికులను అక్కడే వదిలేసి బస్సు వెళ్లిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ మనుషులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ హార్ట్ పేషంట్ అనే దయ కూడా లేకుండా ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. హార్ట్ పేషెంట్‌కు బస్సు మిస్ అవ్వడంతో ఇక చేసేదేం లేక వేరే బస్సు ఎక్కి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నాడు. ఎలాగోలా అతికష్టం మీద మళ్లీ ఆ బస్సును చేరుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఒకవేళ ఆ ప్రయాణికుడికి ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?
సదరు ప్రయాణికుడికి ఏమైనా జరిగితే ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెబుతుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కంటే సర్వీస్ పేరిట కార్గో వస్తువులను బస్సుల్లో రవాణా చేస్తూ లాభాలు దండుకోవడమే ధ్యేయంగా మారిందా? అని కూడా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్లలో ప్రయాణికుడిని వదిలేసి వెళ్లిన సిబ్బందిపై, బస్సులో సీట్లను కార్గోగా మార్చిన బాధ్యులపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఫార్మర్ ఐడీతో చాలా పనుంది బాసూ: https://site.singidinews.com/revalli-farmer-registration/
మానవత్వం చూపిన ప్రయాణికుడు
తనకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా అనేక తంటాలు పడి నారాయణపేటకు చేరుకున్న సదరు ప్రయాణికుడు గోపాల్ గౌడ్ ఆర్టీసీ డిపోలో ఉన్న భద్రతశాఖ అధికారులకు జరిగిన సంఘటన గూర్చి కంప్లైంట్ చేశాడు. దీంతో అధికారులు సదరు బస్సు కండక్టర్ని పిలిచి చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై కంప్లైంట్ రాసి ఇవ్వాలని అధికారులు సదరు ప్రయాణికుడిని కోరగా.. అది విన్న బస్సు కండక్టర్ ఆ ప్రయాణికుడిని ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని క్షమాపణ కోరాడు. దీంతో ప్రయాణికుడు గోపాల్ గౌడ్ కండక్టర్‌పై మానవత్వం చూపి వదిలేశాడు.

డ్రైవర్ కండక్టర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎం
ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ యాకన్న సదరు బస్సు కండక్టర్, డ్రైవర్లను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. ప్రయాణికుల రక్షణ ఆర్టీసీ సంస్థ బాధ్యతని, వారు ప్రయాణిస్తేనే ఆర్టీసీ ప్రగతి రథచక్రానికి కదిలే బలం ఉంటుందని, డ్రైవర్ కండక్టర్ని మందలించారు. మరో మారు ఇటువంటి సంఘటనలు తన దృష్టికి వస్త కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు తెలిపారు.














