Share
  • వంట సామగ్రి తరలింపుపై విద్యార్థుల ప్రశ్నలు
  • వంటకు సంబంధించిన సామగ్రిని బయటకు తీసుకెళ్తున్నారని విద్యార్థుల ఆరోపణలు

రేవల్లి, అక్టోబర్ 4 (సింగిడి): Revalli Kasturba Schoolలోని వంట నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలో విద్యార్థుల భోజనం కోసం వినియోగించే వంట సామగ్రితో పాటు వండిన ఆహార పదార్థాలను కూడా వంట సిబ్బంది సాయంత్రం వేళలో తమ వెంట తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపించినట్లు సమాచారం. తమ కళ్లముందే వంట సామగ్రిని లగేజీలో పెట్టుకుని బయటకు తీసుకెళ్తుండటాన్ని విద్యార్థులు ప్రశ్నించినట్లు తెలిపారు.

Revalli Kasturba School:విద్యార్థులు ప్రశ్నించడంతో వంట చేయకుండా వెళ్లిన వైనం

Revalli Kasturba School Revalli Kasturba School

వంట సామగ్రిని ఎందుకు బయటకు తీసుకెళ్తున్నారని విద్యార్థులు ప్రశ్నించడంతో వంట సిబ్బంది వంట చేయకుండా ఇంటికి వెళ్లినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో పాఠశాలలో కొంతసేపు పరిస్థితిపై అయోమయం నెలకొన్నట్లు సమాచారం. అనంతరం ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా వంట సిబ్బందిని సంప్రదించగా వారు తిరిగి వచ్చి మధ్యాహ్న భోజనం వండినట్లు విద్యార్థులు తెలిపారు. వసతి పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు భోజనం అనేది అత్యంత ప్రాథమిక అవసరం కావడంతో వంట నిర్వహణపై తలెత్తిన అనుమానాలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

అసలు TGSRTCలో ఏం జరుగుతోంది: https://site.singidinews.com/narayanpet-rtc-bus-negligence/

ఆసుపత్రిలో విద్యార్థులు.. మండల అధికారుల పరామర్శ

Revalli Kasturba School Revalli Kasturba School

ఇదిలా ఉండగా కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురై రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత శ్రద్ధ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మార్వో సరస్వతి, ఎంపీడీవో ఆలీ కీర్తన, ఎంఈఓ వరప్రసాద్ రావు తదితరులు మండల అధికారులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు, పాఠశాలలో అందుతున్న భోజనం, వంట నిర్వహణ తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ముగిసిన ఆసియా క్రీడలు:  https://epaper.singidinews.com/clip/2146

కొత్తవారు వచ్చే వరకు ప్రస్తుత వంట సిబ్బందే

Revalli Kasturba Schoolలో జరిగిన విషయంపై జీసీడీవో ఇందిరాదేవిని సంప్రదించగా ప్రస్తుతం ఉన్న వంట సిబ్బందిని యథావిధిగా కొనసాగిస్తామని, కొత్త వంట సిబ్బంది వచ్చే వరకు వారే విధులు నిర్వహిస్తారని తెలిపారు. అయితే వంట సామగ్రిని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్తున్నారన్న విద్యార్థుల ఆరోపణలపై స్పష్టమైన వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పాఠశాలలో ప్రభుత్వ నిధులతో సమకూర్చిన వంట సామగ్రి ఏదైనా ఉంటే వాటి వినియోగం, భద్రత, నిర్వహణపై సంబంధిత అధికారులు రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఆరోగ్యం, భోజన నాణ్యత, వంట సామగ్రి వినియోగం వంటి అంశాల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు.

Share