Share
  • ఒక ఘటనను మరవకముందే మరో ఘటన.. విద్యార్థులపై దాడుల ఆరోపణలు
  • కస్తూర్బా పాఠశాల ఘటన తర్వాత జడ్పీహెచ్‌ఎస్‌లో మరో విద్యార్థికి గాయాలు
  • విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన.. విద్యాశాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు

రేవల్లి, సెప్టెంబర్ 23 (సింగిడి): Revalli School News తల్లిదండ్రులనే కాకుండా విద్యార్థులను కూడా కలవరపెడుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలల్లోనే వారిపై దాడుల ఆరోపణలు వెలుగులోకి రావడం రేవల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన Student Safety in Schools ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. ఒక ఘటనను ప్రజలు పూర్తిగా మరవకముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై శారీరకంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా Revalli School News ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది.

భారత్ కు ముచ్చెమటలు పట్టించిన జపాన్:  https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Revalli School News

ఇటీవల రేవల్లి మండలంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులపై ఓ ఉపాధ్యాయురాలు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ ఘటనపై మండలంలో చర్చ జరుగుతుండగానే, రేవల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో మరో విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది.

Revalli School News: ప్యాడ్‌తో కొట్టడంతో తలకు గాయం

జడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి భానుప్రకాష్‌ను ఓ ఉపాధ్యాయుడు ప్యాడ్‌తో కొట్టినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయని వారు చెబుతున్నారు. విద్యార్థికి గాయం కావడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని ప్రశ్నించినట్లు సమాచారం. తమ పిల్లలను చదువుకునేందుకు పాఠశాలకు పంపిస్తే ఇలా దాడులకు గురికావడం ఏమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుస ఘటనలపై అధికారుల దృష్టి ఎప్పుడు?

Revalli School News

ఒక ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం విద్యాశాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. విద్యార్థులపై దాడుల ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు ఘటనలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మండల ఎంఈఓ స్థాయిలో పాఠశాలల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారా? ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎలా వ్యవహరిస్తున్నారనే అంశంపై ఎప్పటికప్పుడు పరిశీలన జరుగుతోందా? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఫర్టిలైజర్ షాపులపై తనిఖీలేడ మహాప్రభో: https://site.singidinews.com/revalli-seed-dealers-inspectionss/

విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే పేరుతో శారీరకంగా దాడి చేయకుండా, సమస్యలను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించే విధంగా పాఠశాలల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలపై మండల విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Share