Share
  • వంట మనుషులు, ఎస్‌ఓ జ్యోతి బదిలీ చేయాలి
  • ప్రజావాణిలో ఫిర్యాదు..
  • దసరా తర్వాత చర్యలకు ఎంపీడీవో హామీ
  • విద్యార్థుల వనరుల పరిరక్షణలో నిర్లక్ష్యం తగదు: మిద్దె మహేష్

రేవల్లి, అక్టోబర్ 5, (సింగిడి): రేవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వినియోగించాల్సిన వంట సామగ్రి దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని బీఎస్పీ వనపర్తి జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.(BSP ON Kasturba School) విద్యార్థుల కోసం ప్రభుత్వం అందించిన వంట సామగ్రిని సంబంధిత అధికారుల అనుమతి లేకుండా బయటకు, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని మిద్దె మహేష్ తెలిపారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు పాఠశాల ఎస్‌ఓ జ్యోతి దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విద్యార్థులకు అందాల్సిన ఆహారం, వసతులు, ప్రభుత్వ వనరులు సక్రమంగా వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. (BSP ON Kasturba School)

రేవల్లి కస్తూర్బాలో కలకలం: https://site.singidinews.com/revalli-kasturba-school/

BSP ON Kasturba School BSP ON Kasturba School

BSP ON Kasturba School: ప్రజావాణిలో ఫిర్యాదు

BSP ON Kasturba School

అనంతరం రేవల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వంట మనుషులు, ఎస్‌ఓ జ్యోతిని బదిలీ చేయాలని కోరుతూ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎంపీడీవో దసరా సెలవులు అనంతరం వంట మనుషులను, ఎస్‌ఓ జ్యోతిని బదిలీ చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు మిద్దె మహేష్ తెలిపారు. వంట సామగ్రి దుర్వినియోగంపై ఉన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి మధు, సెక్టార్ అధ్యక్షులు పూర్ణకంటి దేవేందర్, కార్యదర్శి అంకూరి రాము, బూత్ అధ్యక్షులు కలుమూరి కిరణ్, తప్పేట దేవరాజ్, వాడల రాజు తదితరులు పాల్గొన్నారు. (BSP ON Kasturba School)

నార్కోటిక్ డాగ్ స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/739

Share