Share
  • యాప్ గురించి తెలిసేది ఎప్పుడు? పంట పండేది ఎప్పుడు?
  • రేవల్లి మండల కేంద్రం, వివిధ గ్రామాల్లో రైతుల అవస్థలు
  • చదువుకున్న యువకుల దగ్గరికి వెళ్లి సహాయం కోరుతున్న అన్నదాతలు

రేవల్లి సెప్టెంబర్ (సింగిడి): వ్యవసాయ పనులతో పొలాల్లో నిత్యం శ్రమించే రైతన్నకు ఇప్పుడు యూరియా కోసం మరో కొత్త తిప్ప తప్పడం లేదు. (Urea App Booking) యూరియా కొనుగోలు, బుకింగ్ కోసం యాప్‌ను వినియోగించాల్సి రావడంతో రేవల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్నా, మొబైల్ యాప్‌ల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పలువురు రైతులు యూరియా కోసం అటూ ఇటూ తిరుగుతూ అరిగోస పడుతున్నారు. (Urea App Booking) పంటకు సరైన సమయంలో ఎరువు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. యాప్‌లో ఎలా నమోదు చేసుకోవాలి, బుకింగ్ ఎలా చేయాలి, ఏ వివరాలు నమోదు చేయాలి, బుకింగ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి యూరియా తీసుకోవాలి వంటి అంశాలపై సరైన అవగాహన లేక రైతులు అయోమయంలో పడుతున్నారు.

మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ దానిలో యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక కొందరు రైతులు మండల కేంద్రానికి పరుగులు తీస్తున్నారు.గ్రామాల్లో చదువుకున్న యువకులు కనిపిస్తే చాలు రైతులు వారి వద్దకు వెళ్లి మొబైల్ అందిస్తూ “చదువుకున్న యువకుల దగ్గర జర చూడు నాయనా… యూరియా యాప్‌లో బుకింగ్ చేసి పెట్టు” అంటూ సహాయం కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. (Urea App Booking)

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Urea Appలో Booking కోసంగంటల తరబడి ఎదురుచూపు..

Urea App Booking

కొందరు యువకులు రైతులకు సహాయం చేస్తుండగా, మరికొందరు అందుబాటులో లేకపోవడంతో రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ముఖ్యంగా వృద్ధ రైతులు ఈ యాప్ విధానంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో దుకాణానికి వెళ్లి అవసరమైన ఎరువును కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మొబైల్, యాప్, నమోదు, బుకింగ్ అంటూ కొత్త విధానం రావడంతో తమకు అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.

పొలంలో పనులు చూసుకోవాలా, యాప్‌ గురించి తెలుసుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పంటలకు యూరియా అవసరం ఏర్పడిన సమయంలో యాప్‌పై పూర్తి అవగాహన లేకపోవడం రైతులను కలవరపెడుతోంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్: https://site.singidinews.com/niranjan-reddy-women-mlas-attack-comments/

దిగుబడి తగ్గే ప్రమాదముంది

సరైన సమయంలో యూరియా అందకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడుతుందని, చివరకు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. “యాప్ గురించి తెలిసేది ఎప్పుడు? పంట పండేది ఎప్పుడు?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.రేవల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రైతులకు యాప్ వినియోగంపై అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలోనే రైతులకు యాప్‌లో నమోదు, బుకింగ్ విధానం, యూరియా పొందే ప్రక్రియపై వివరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సంబంధిత సిబ్బంది గ్రామాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందిస్తే ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు.

డిజిటల్ విధానాలు ఎంత ఉపయోగకరమైనా వాటిని ఉపయోగించే వారందరికీ సరైన అవగాహన కల్పించకపోతే ఇబ్బందులు తప్పవని రైతుల పరిస్థితి స్పష్టం చేస్తోంది. ఒకవైపు పంటను కాపాడుకోవాలనే ఆందోళన, మరోవైపు యూరియా కోసం యాప్ తిప్పలు… ఈ రెండింటి మధ్య రేవల్లి మండలంలోని రైతన్నలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Share