Share
  • వైన్ షాప్ లేకున్నా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలకు ఫుల్‌లోడ్ ఖాళీ సీసాలు
  • అధికారుల నిఘా ఎక్కడ..? అక్రమ విక్రయాలపై చర్యలేవి..?

రేవల్లి,ఏదుల, సెప్టెంబర్ 9 (సింగిడి): వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని (Illegal Liquor Sales) మద్యం అక్రమ విక్రయాలపై స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో అధికారిక వైన్ షాప్ లేకపోయినా, బెల్ట్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్లీకో బెల్ట్ షాప్ అన్నట్లుగా పుట్టగొడుగుల్లా అక్రమ మద్యం విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఏదుల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజంతా విక్రయమైన మద్యం ఖాళీ సీసాలను ఆటోలలో ఫుల్‌లోడ్ చేసి తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అధికారిక వైన్ షాప్ లేని ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో ఖాళీ మద్యం సీసాలు బయటకు వస్తుండటంపై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పసిడి ప్రియులకు శుభవార్త: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

అధికారులెక్కడ..Illegal Liquor Sales) కనిపించట్లేదా సారూ..

Illegal Liquor Sales

బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇంత విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేయడానికి గల కారణాలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం మండల కేంద్రంపై దృష్టి పెట్టడం లేదా? లేక అక్రమ మద్యం విక్రయాలపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మద్యం అక్రమ విక్రయాలు ఇదే విధంగా కొనసాగితే యువతపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, మండల కేంద్రంలోని అక్రమ మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యూరియా ఇదేం‘దయా’: https://site.singidinews.com/urea-app-booking-revalli-farmers-problems/

Share