- బిజెపి నాయకులను రెచ్చగొట్టకండి
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుల ఇంటిపై దాడి హేయమైన చర్య
- కాంగ్రెస్ గూండాల దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి
- బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట సెప్టెంబర్ (సింగిడి): బీజేపీ (BJP) రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుల ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాల చర్యలను BJP జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు గుండాలు దాడులకు,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప, ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, నాయకుల ఇళ్లపైకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

రాజకీయంగానే ఎదుర్కోవాలి: BJP జిల్లా ప్రధాన కార్యదర్శి
రాజకీయ సిద్ధాంతాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి కాని రాళ్లు, కర్రలు,దాడులతో కాదని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంపై దాడి అంటే అది ఒక పార్టీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ కక్షలు, దాడుల తెరలేపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి ఘటనకు నిరసనగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ విలువలను కాపాడేందుకు బీజేపీ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నామని లేకపోతే మీరు ఇటుక బిడ్డలతో కొడితే మేము కంకర్ రాళ్లతో దాడులు చేసే వాళ్ళమని రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
‘బాసింగ బలాలు’ డ్యాన్సర్‌పై కేసు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

ఈ కార్యక్రమంలో 28వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి,పార్లమెంట్ కొ-కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జీవన్, కీసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,నియోజకవర్గ నాయకులు జూలూరి మనిష్ గౌడ్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ,నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్, దుగ్గొండి మండల అధ్యక్షులు రాజేందర్,చెన్నారావుపేట్ మండల అధ్యక్షులు శేఖర్, సినియర్ నాయకులు కోమల్ రెడ్డి,అబోతు రాజు, బాల్నే జగన్, మహేందర్ రెడ్డి, దుంకా దువ్వ రంజిత్,అన్న లింగయ్య,బచ్చు ఎంకన్న, సమ్మయ్య,నూనె రంజిత్, మహిళా నాయకురాలు సరిత,ప్రతిక్ష సింగ్, కాసుల నాగేంద్రబాబు,వల్లె పర్వతాలు, ముత్యాల శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్,ఎర్ర రాజు,శివ, మరియు నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు, BJP యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి సమాచారంపై మౌనమేలా సారూ: https://site.singidinews.com/prajavani-officials-silent-no-info/















