Share
  • కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది?
  • ముమ్మాటికి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి
  • ఎంఐఎం పార్టీ కొరకు విమోచన దినోత్సవం జరపకుంటే బీజేపీ ఊరుకోదు
  • హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలుపుతానన్న వారు కావాలా?.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..
  • రేవంత్ తేల్చుకోవాలి: రాణి రుద్రమ….!

నర్సంపేట, సెప్టెంబర్ 16 (సింగిడి): తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి (Rani Rudrama) ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎంఐఎం పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాణి రుద్రమ రెడ్డి (Rani Rudrama) మాట్లాడుతూ..  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల సొంత రాజకీయ స్వలాభాల కొరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపితే ఎంఐఎం పార్టీ నుంచి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకోసమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోతుందని ఆమె మండిపడ్డారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరుపురాని, మరుగునపరచలేని చారిత్రక ఘట్టమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. విలీన దినం, ప్రజా పాలన దినం అంటూ పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు. (Rani Rudrama)

ఇక UPI చేస్తే చార్జీల మోతే!: https://epaper.singidinews.com/clip/1723

Rani Rudrama

అది ప్రజాపాలన కాదు: Rani Rudrama

కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చారిత్రక దినోత్సవం అసలు స్ఫూర్తిని మరుగునపరచడం ప్రజా పాలన కాదు అని ఆమె ఆరోపించారు. తెలంగాణ చరిత్రను రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని ఆమె సూచించారు. భారత దేశానికి ఆగస్టు 15 1947 న స్వాతంత్య్రం వస్తే తెలంగాణ సంస్థానానికి మాత్రం సెప్టెంబర్ 17 1948న స్వాతంత్య్రం లభించిందని, దానికి ఆనాటి ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషే కారణమని ఆమె (Rani Rudrama) గుర్తు చేశారు.

ఆ రోజే తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సెప్టెంబర్ 17 జరుపుకోవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించారని అన్నారు. కానీ వారి ఆదేశాలను పక్కనపెట్టి సొంత పార్టీ లాభాల కొరకు ఇన్నేళ్లు జరపకుండా కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జరుపలేకపోతుందని ఆమె ప్రశ్నించారు.

నిజాం వారసులతో దోస్తీనా?:Rani Rudrama

తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో కలపటానికి ఒప్పుకోని నిజం రాజు అవసరమైతే పాకిస్తాన్లోనైనా కలపడానికి సిద్ధపడ్డాడని, అలాంటి వారి వారసులతో నేడు కాంగ్రెస్ దోస్తి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకొని జాతీయ జెండాను ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండూ ఒకటే కావు.

వాటి లక్ష్యాలు, రాజకీయ నేపథ్యం, కాలపరిమితి, అంతిమ లక్ష్యాలు వేర్వేరు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన వాస్తవాన్ని ఎవరూ చెరిపివేయలేరన్నారు సెప్టెంబర్ 17 తరువాత కమ్యూనిస్టు సాయుధ పోరాటం కొనసాగింది. 1950-51లో కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు స్టాలిన్‌తో చర్చలు జరిపిన అంశాలు చరిత్రలో ఉన్నాయని తమకు అనుకూలమైన చరిత్రను మాత్రమే చెప్పి, అసౌకర్యంగా ఉన్న చరిత్రను పాతిపెట్టే రోజులు పోయాయని అన్నారు.

చెత్తతో పాముల కలకలం: https://site.singidinews.com/revalli-6th-ward-road-snake-problem/

Rani Rudrama

వేర్వేరుగా పాఠ్యాంశాల్లో చేర్చాలి

హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండింటి చరిత్రను వేర్వేరుగా, వాస్తవ ఆధారాలతో పాఠ్యాంశాల్లో చేర్చాలని, పరకాల, భైరాన్‌పల్లి వంటి చారిత్రక ఘటనలు, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండను నేటి తరానికి తెలియజేయాలని అన్నారు, నిజాం రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అధికారికంగా స్మరించాలి.తెలంగాణ విమోచన చరిత్ర ఎవరి సొత్తూ కాదన్నారు అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చరిత్ర. చరిత్రను చరిత్రగానే చెప్పాలి, రాజకీయ రంగులు పులమకూడదు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే అని రానా ప్రతాప్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ 28th వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం ఆంజనేయులు,మాజీ మండల అధ్యక్షులు అబోతు రాజు యాదవ్,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంగేమ్ శంకర్,నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబెర్ మహేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేత్కర్ నల్లబెల్లి అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, చెన్నరావుపేట అధ్యక్షులు శేఖర్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు,బీజేపీ పట్టణ నాయకులు విజయ్ సింగ్, కాసుల నాగేంద్ర బాబు, అల్లం నిఖిల్ ,ముత్యాల శ్రీనివాస్, సామల ప్రవీణ్ కుమార్, నూనె రంజిత్,అజీమ్, అనిల్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share