Share
  • మీడియాకు ఫొటోలు, వివరాలు ఇవ్వని అధికారులు
  • పంచాయతీ కార్యాలయాల్లో మధ్యాహ్నానికే తాళాలు..
  • అనంతగిరిపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలి

కోదాడ ప్రతినిధి (సింగిడి): అనంతగిరి మండలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి (PrajaVani) కార్యక్రమం సమాచారాన్ని మీడియాకు అందించడంలో అనంతగిరి మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించినప్పటికీ.. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వివరాలను పాత్రికేయులు కోరినా అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ప్రజలు ఏ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే సమాచారం ప్రజలకు తెలియాల్సి ఉంది. అయితే సమాచారం కోరినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పాత్రికేయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారంలో పారదర్శకత పాటించాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మధ్యాహ్నానికే కార్యాలయాలు ఖాళీ?

PrajaVani

మరోవైపు మండలంలోని పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సిబ్బంది మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్‌కు ఇక అసలు పరీక్ష: https://epaper.singidinews.com/view/108/telangana/1

PrajaVaniపై కలెక్టర్‌ దృష్టి సారించాలి

ప్రజావాణి సమాచారాన్ని మీడియాకు అందించకపోవడం, పంచాయతీ కార్యదర్శుల విధుల నిర్వహణపై వస్తున్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని అధికారుల పనితీరును సమీక్షించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణను మరింత పెంచాలని కోరుతున్నారు.

నీళ్లున్నా ఏం ప్రయోజనం: https://site.singidinews.com/sridhar-babu-polaram-lake-mahamutharam/

Share