- అక్రమ కేసును తీవ్రంగా ఖండించిన బి.ఆర్.ఎస్. నేత సోయం వీరభద్రం
దమ్మపేట, ఆగష్టు 1 (సింగిడి): మాజీ ప్రభుత్వ విప్, BRS పార్టీ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించాయని BRS పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం తీవ్రంగా ఖండించారు. శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేగా కాంతారావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు పూర్తిగా అవాస్తవమని సోయం వీరభద్రం కొట్టిపారేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రతి ఆడబిడ్డను తన సొంత సోదరిలా భావించే పవిత్రమైన వ్యక్తిత్వం రేగా కాంతారావు దని ఆయన స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో BRS పార్టీ తరపున రైతాంగం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఒక వైపు ఆదివాసి నాయకుడు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్య ఆరోపణలను చట్టపరమైన పద్ధతుల్లో ఎదుర్కొని, రేగా కాంతారావు గారు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
Read Now: https://site.singidinews.com/tet-is-shameless-thing-for-teachers/














