Telangana Congressలో జోరుగా నడుస్తున్న చర్చలివే..
- అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తర్వాత తెలంగాణ కేబినెట్‌లో భారీ మార్పులు ఉంటాయన్న ప్రచారం
- నలుగురు మంత్రులను తప్పించే యోచనలో సీఎం శిబిరం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ
- చర్చలో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్లు
- స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, ఆయన స్థానంలో ..
- అడ్లూరి లక్ష్మణ్‌ను స్పీకర్‌గా చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం
- కొండా సురేఖను తప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం
- సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి సురేఖ వ్యవహారంపై ఆధారాలు ఇచ్చినట్టు కథనాలు
- జూపల్లి కృష్ణారావు స్థానంలో ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు
- మరోవైపు బలంగా వినిపిస్తోన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం
- రామ్మోహన్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి దక్కవచ్చన్న చర్చ
- పొన్నం ప్రభాకర్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. అధిష్ఠానం అంగీకరించడం లేదన్న సమాచారం
- పొన్నం స్థానంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరును సీఎం శిబిరం ప్రతిపాదించినట్టు ప్రచారం
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖ అప్పగించే యోచన ఉన్నట్టు సమాచారం
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖకు బదులుగా రెవెన్యూ శాఖ కోరుతున్నట్టు ప్రచారం
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాఖ మార్పుపై కూడా కాంగ్రెస్‌లో చర్చ
- రెవెన్యూ శాఖను మార్చితే మున్సిపల్ శాఖ ఇవ్వాలని పొంగులేటి పట్టుబడుతున్నట్టు సమాచారం
- మొత్తంగా రెవెన్యూ, నీటిపారుదల, పరిశ్రమలు, పురపాలక శాఖల్లో భారీ మార్పులు ఉండొచ్చన్న ప్రచారం
మాజీ మంత్రి మల్లన్న డ్యాన్స్ వైరల్: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i















