- రైతుల ఆమోదంతోనే భూసేకరణ చేపట్టాలి
- ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇవ్వాలి
- బలవంతపు నోటీసులు ఆపాలి
- నిర్వాసితులకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు కల్పించాలి
గోపాల్‌పేట, అక్టోబర్ 6 (సింగిడి): Buddharam farmers protest మొదలయింది. మా భూములను కారుచౌకగా తీసుకుంటే ఒప్పుకోమని డిమాండ్ చేస్తూ Buddharam farmers protest చేస్తున్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుద్ధారం గ్రామంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. బుద్ధారం పెద్ద చెరువు భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని రచ్చకట్ట వద్ద ఈ దీక్షలను గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. జబ్బర్ ముఖ్య అతిథిగా హాజరై రిలే నిరాహార దీక్షలను (Buddharam farmers protest) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న బుద్ధారం రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్ వే: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/747
రైతుల ఆమోదంతోనే భూసేకరణ చేపట్టాలి

బుద్ధారం గ్రామంలో వెంటనే గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు, ఆమోదం తీసుకున్న తర్వాతే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని ఎం.డి. జబ్బర్ డిమాండ్ చేశారు. రైతులు తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి చట్ట ప్రకారం న్యాయమైన నష్టపరిహారం అందించాల్సి ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. రైతుల ఆమోదం లేకుండా గ్రామంలోకి వచ్చి బలవంతంగా నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. బలవంతపు నోటీసులు ఇచ్చే చర్యలను సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
హామీలు అమలు చేయాలి

ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రైతులతో మాట్లాడుతూ వారి భూములకు రూ.20 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని ఎం.డి. జబ్బర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుల ఆమోదం లేకుండా నోటీసులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడం సరైన విధానం కాదన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే బుద్ధారం గ్రామానికి వచ్చి నిర్వాసిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు.
ఇసుక కొరతతో నిలిచిన ఇందిరమ్మ ఇండ్లు: https://site.singidinews.com/indiramma-indlu-work-stopped-as-lack-of-sand/
Buddharam farmers protest: ఎకరాకు రూ.40 లక్షలు ఇవ్వాలి
బుద్ధారం నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నష్టపరిహారం అందించాలని, నిర్వాసిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులు తమ హక్కుల కోసం పోరాడి న్యాయం సాధించారని గుర్తుచేశారు. అదే విధంగా బుద్ధారం రైతులు కూడా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సీపీఎం పార్టీ నిర్వాసిత రైతుల పక్షాన ముందుండి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండ్ల రాజు, బుద్ధారం గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్, బుద్ధారం పెద్ద చెరువు నిర్వాసితుల పోరాట కమిటీ సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













