- పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలి
- దమ్మపేటలో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం సక్సెస్..
- ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లా నేత గడల శ్రీనివాసరావు
- ఎస్కే రహీం ఆధ్వర్యంలో తరలివచ్చిన జనసైనికులు..
దమ్మపేట (సింగిడి): (janasena jana jatara) మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్ వేదికగా జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కే రహీం నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది మంది జనసైనికులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలో జనసేన జెండాలు చేతబూని, వందలాది మోటార్ సైకిళ్లతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. ‘జై జనసేన’, ‘పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో దమ్మపేట పురవీధులు మార్మోగాయి.

యువత అత్యంత ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొని పార్టీ బలాన్ని నిరూపించారు. అనంతరం కార్యకర్తలంతా భారీ ప్రదర్శనగా వినాయక ఫంక్షన్ హాల్ లోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణం అంతా జనసేన జెండాలతో, కార్యకర్తల నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ముఖ్య నాయకులు గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. (janasena jana jatara)
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం: గడల శ్రీనివాసరావు
(janasena jana jatara) సమావేశంలో జిల్లా నాయకులు గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రైతు బందు, రైతు భీమా పథకాల అమలు పై రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సైతం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అగ్రహాంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లకు దిటుగా జనసేన పార్టీ ఎదుగుతుందని, పేర్కొన్నారు. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఎదిగించేందుకు ప్రతీ ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని, ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. జనసేన అధినేత ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజా సమస్యలపై జనసేన ఎల్లప్పుడూ రాజీలేని పోరాటం చేస్తుందని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అందరి సహకారంతో ముందుకు: ఎస్కే రహీమ్

ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వాహకులు, మండల అధ్యక్షుడు ఎస్కే రహీం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు నియోజకవర్గ జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును ప్రతీ గ్రామానికి తీసుకెళ్తామని, ప్రజాపక్షాన నిలబడి మరిన్ని సేవా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వివరించారు.భారీగా తరలివచ్చిన శ్రేణులుఈ ఆత్మీయ సమ్మేళనంలో మండల, నియోజకవర్గ స్థాయికి చెందిన పలువురు ముఖ్య నాయకులు ప్రసంగించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేశారు. (janasena jana jatara)
Read Now: https://site.singidinews.com/janasena-expresses-strong-anger-over-the-ashwapuram-incident/
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i















