Share
  • వెలగని వీధిలైట్లు.. అధికారుల పర్యవేక్షణ శూన్యం
  • ఏం అడిగినా ఫండ్ లేదంటూ సమాధానం
  • రెండేళ్లుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లైట్లకే దిక్కు లేదా? అని గ్రామస్తుల ప్రశ్న

ములుగు ప్రతినిధి, సెప్టెంబర్ 6 (సింగిడి): మంగపేట మండలం మల్లూరు గ్రామం అంధకారంలో మగ్గుతోందని, అధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు (Mallur Village Street Lights). గ్రామంలో వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు చీకటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు కనీసం వీధిలైట్ల సౌకర్యం కూడా కల్పించలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏం అడిగినా ‘ఫండ్ లేదు’ అంటూ సమాధానం ఇస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వర్షాకాలం కావడంతో రాత్రివేళల్లో చీకటిలో రోడ్లపై నడవాలంటే విషపురుగుల సంచారం భయాందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు.

Mallur Village Street Lights

ఫోక్ డ్యాన్సర్ మాధురి ఆత్మహత్యాయత్నం: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Mallur Village Street Lights రాత్రిళ్లు బయటకు రావాలంటేనే వణుకుతున్నాం..

తేళ్లు, పాముల సంచారం ఉండే అవకాశం ఉన్నందున చీకట్లో బయటకు రావాలంటే మహిళలు, వృద్ధులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం కూడా పూర్తిగా పడకేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్ సక్రమంగా తిరగకపోవడంతో రోడ్ల వెంట చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని చెబుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే మల్లూరు గ్రామంలో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు వెలిగించేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Mallur Village Street Lights

100 రోజులుగా ముక్కే లేదు: https://site.singidinews.com/jyotiba-phule-gurukul-school-nonveg-shortage/

Share