Share
  • గ్రామ సమస్యలపై బీఎస్పీ నాయకుల పరిశీలన
  • మోరీలో చెత్త తొలగించాలి.. ఎస్సీ కాలనీలో విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలి

రేవల్లి, ఆగస్టు 28 (సింగిడి): బండరాయిపాకుల Panchayat Secretary తీరుతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని బీఎస్పీ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో బీఎస్పీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్, గ్రామ నాయకులు శుక్రవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేస్తూ గ్రామంలోని సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వారు గుర్తించారు.గ్రామంలోని మోరీల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు.

చెత్తను తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌ ద్వారా కోరగా, ప్రస్తుతం సాధ్యం కాదని, ఇంకా సమయం పడుతుందని సమాధానం ఇచ్చారని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.అధికార పార్టీ నాయకులకు పంచాయతీ కార్యదర్శి కొమ్ముకాస్తూ విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని మిద్దె మహేష్ అన్నారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణను సస్పెండ్‌ చేయాలని బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్‌ చేశారు.

జయహో భారత్.. విశ్వక్రీడలకు సిద్ధం: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

కోదాడ సీఐ ఖాకీ జులుం: https://x.com/SingidiNews2026/status/2093272318139371829?s=20

Panchayat Secretary తీరుతో ఇబ్బందులు..

Panchayat Secretary

అదేవిధంగా ఎస్సీ కాలనీలో విద్యుత్‌ లైన్‌ లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మోరీల్లో పేరుకుపోయిన చెత్త కారణంగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను బీఎస్పీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు యాదగిరి, పూర్ణంకంటి దేవేందర్, మిద్దె బాలకృష్ణ, మిద్దె చందు తదితరులు పాల్గొన్నారు.

అసలు ఎక్కడ ఆడుకోవాలి సారూ..: https://site.singidinews.com/sports-grounds-not-fit-for-playing/

Share