Share
  • లంబాడాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భోగ్ భండారో
  • భక్తి, శ్రద్ధలతో నిర్వహణ

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో (సింగిడి):  లంబాడాలకు దైవమంటే ఎంత భక్తో ఈ Bhog Bhandaro Festival చాటి చెబుతోంది. ఆధునిక హైటెక్‌ యుగంలోనూ లంబాడాలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను తండాల్లో కొనసాగిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నైతిక, మానవీయ విలువలకు ప్రాధాన్యమిస్తూ తమ సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఉగాది, దసరా పండుగలకు ముందు లంబాడాలు భోగ్‌ భండారో పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

Bhog Bhandaro Festival: బోర్లగూడెం తండాలో ప్రత్యేక వేడుకలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెం తండాలో లంబాడాల ఆరాధ్యదైవాలైన శ్రీ బాలాజీ, శ్రీశ్రీ హేమాసాత్‌ మహారాజ్‌ దేవాలయంలో భోగ్‌ భండారో వేడుకలను గురువారం తండావాసులు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, తండా వాసులంతా విరాళాలు సేకరించి సమష్టిగా ఈ వేడుకలను నిర్వహించారు. తమ కోర్కెలు నెరవేరాలని దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు తీసుకువచ్చి పూజలు నిర్వహించ్చారు. చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పిస్తారు.

ఆఖరి మజిలీలోనూ అవస్థలేనా: https://site.singidinews.com/polikepadu-cremation-road/

Bhog Bhandaro Festival: తొమ్మిది పొయ్యిలపై తొమ్మిది రకాల నైవేద్యాలు

Bhog Bhandaro Festival Bhog Bhandaro Festival

భోగ్‌ భండారో వేడుకల్లో భాగంగా లంబాడాలు తొమ్మిది కట్టెల పొయ్యిలపై తొమ్మిది రకాల వంటకాలను తయారు చేసి గిరిదేవతలకు నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకత. శ్రీరాం మహారాజ్‌కు (చుర్మో) బాలాజీకి పప్పుచారు, హనుమాన్‌కు (చుర్మో), లకన్‌ గిరి మహారాజ్‌కు (జళ్‌ భోగ్‌), హేమాసాత్‌ మహారాజ్‌కు (బండారో), సేవాలాల్‌ మహారాజ్‌కు (కడావో), మేరామాయాడీకి (ఖీర్‌), సరస్వతీ దేవికి (చుర్మో), వాగోబాకు (చుర్మో) సమర్పించారు . పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో చప్పిడి పప్పన్నంతో అన్నదానం నిర్వహించారు. భక్తి, ఐకమత్యం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు లంబాడాల సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారి, కమిటీ సభ్యులు, తండా నాయకులు పాల్గొన్నారు.

పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం: https://epaper.singidinews.com/clip/2437

Share