- వృద్ధ రైతును నిలువునా ముంచిన బ్రోకర్..!
- వల విసిరారు.. వసూలు చేశాడు..!
- సెల్ఫీ వీడియోతో వెలుగులోకి దళారి బాగోతం..!
- మరో రూ. 50 వేలు ఇస్తేనే పట్టా..!
- వృద్ధుడి కాలి గాయాన్నీ చూడని కసాయి దళారి!
- దమ్మపేట రెవెన్యూ ఆఫీస్‌లో ఆగని దోపిడి…
దమ్మపేట (సింగిడి): దమ్మపేట మండల రెవెన్యూ పరిధిలో దళారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు అధికారులతో తమకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని, అమాయక రైతులను (PassBook) బ్రోకర్లు నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా ముష్టిబండ గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతును ఓ దళారి నమ్మించి వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు కన్నీళ్లతో తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దళారి నెట్వర్క్ గుట్టు రట్టయింది.
వల విసిరారు.. వసూలు చేశాడు..!
ముష్టిబండ గ్రామానికి చెందిన గండిపూడి వెంకటేశ్వరరావు అనే వృద్ధ రైతుకు సర్వే నంబర్ 143లో అర ఎకరం భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ‘భూభారతి’ పాస్‌పుస్తకం పొందడం కోసం ఆయన గత కొన్నాళ్లుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. వృద్ధుడి అమాయకత్వాన్ని, అవసరాన్ని గమనించిన నందమూరి రాము అనే స్థానిక దళారి అతడిని బుట్టలో వేసుకున్నాడు. తహసీల్దార్ ఆఫీసులో ఉన్నతాధికారులతో తనకు గట్టి పట్టు ఉందని, మాట్లాడి వెంటనే పట్టా ఇప్పిస్తానని నమ్మబలికాడు. పని కావాలంటే ముడుపులు చెల్లించాలంటూ సదరు వృద్ధ రైతు నుంచి ఏకంగా రూ.50 వేల అడ్వాన్స్‌ను నొక్కేశాడు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
సెల్ఫీ వీడియోతో బయటపడ్డ బాగోతం
డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా పట్టా రాకపోగా, సదరు దళారి బాధితుడిని తిప్పించుకోవడం ప్రారంభించాడు. ఆఫీసు చుట్టూ తిరగలేక, అటు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక మనస్తాపానికి గురైన వృద్ధ రైతు వెంకటేశ్వరరావు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టుకోవడంతో ఈ వ్యవహారం మండలంలో తీవ్ర సంచలనంగా మారింది.
Read Also: https://site.singidinews.com/child-care-challenges-and-safety/
అధికారుల పేరుతో ఇంకో 50 వేలకు డిమాండ్..
డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నా PassBook రాకపోవడంతో బాధితుడు వెంకటేశ్వరరావు దళారిరామును నిలదీశాడు. దీంతో దళారి అసలు రంగుబయటపెట్టాడు.అధికారులకు ఇంకా ఇచ్చుకోవాలి..మరో రూ. 50 వేలు ఇస్తేనే నీ పని అవుతుంది. లేదంటేకుదరదు అంటూ నిర్మొహమాటంగా తేల్చిచెప్పాడు.అప్పటికే అప్పు చేసి మొదటి విడత డబ్బులు కట్టిన ఆవృద్ధ రైతు దళారి మాటలు విని బిత్తరపోయాడు. ఒకవైపుకాలికి తీవ్ర గాయమై, కట్టుతో కనీసం నడవలేనిదుస్థితిలో ఉన్న ఆ వృద్ధుడు తన బాధను సెల్ఫీ వీడియోద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు
ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.














