- రోజూ 30 నిమిషాల ఆలస్యం..
- డ్రైవర్, కండక్టర్ నుంచి రోజుకో కొత్త సాకు అంటూ ప్రయాణికుల ఆరోపణ
గోదావరిఖని,ఆగస్ట్ 05(సింగిడి): గోదావరిఖని నుంచి ఉదయం 7 గంటలకు భూపాలపల్లికి బయలుదేరాల్సిన TGSRTC బస్సు ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పుడు ఒకటి, రెండు రోజులు మాత్రమే సమయపాలన పాటించి, అనంతరం మళ్లీ యథావిధిగా ఆలస్యంగా నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు.
Read Now: https://site.singidinews.com/passbook-revenue-office-brokers-land-records/
రోజుకో సాకు చెబుతున్న TGSRTC యాజమాన్యం
ఆర్టీసీ బస్సు ఆలస్యానికి రోజుకో కారణం చెబుతున్నారు. ఒకరోజు కొబ్బరికాయ కొట్టాలని, మరోరోజు డీజిల్ నింపడంలో ఆలస్యమైందని, ఇంకోరోజు కండక్టర్ ఇంకా రాలేదని ఇలా రోజుకో కొత్త కారణం చెబుతున్నారని ప్రయాణికులు పేర్కొన్నారు. దీంతో ఉదయం ఉద్యోగాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

Korukanti Chander Interview Promo: https://youtu.be/3qPoXZErUPc?si=2Hu0AcKiRX7z_1EY
ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని, సంబంధిత అధికారులు స్పందించి బస్సును నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.















