- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు
- వాటర్ ట్యాప్ ల వద్ద పేరుకుపోయిన నాచు
- గాలికి వదిలేసిన విద్యార్థుల ఆరోగ్యం
- విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ఉపాధ్యాయులే కాంట్రాక్టర్కు సహకరింపు….!
- సమయానికి శుభ్రం చేయని వాటర్ ట్యాంక్…?
- ప్రిన్సిపల్ అండతో విధులు దుర్వినియోగం చేస్తున్న ఒక మహిళా వర్కర్….?
- డ్యూటీకి వచ్చినట్లు భర్తతో ఫోర్జరీ సంతకాలు…..?
వరంగల్ జిల్లాలోని దుగ్గొండి Social Welfare Girls Hostel ను ప్రస్తుతం చెన్నారావుపేట మండల కేంద్రంలో ప్రైవేట్ బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు . అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో హాస్టల్ లో కలుషిత వాతావరణం కనపడుతుంది.ఎక్కడ చూసినా పేపర్ ప్లేట్స్,వాటర్ గ్లాసుల,చెత్త,చెదారాలతో నిలిచిపోయింది. ఇదేమి అని అడుగుతే నిర్లక్ష్య సమాధానాలు చెపుతున్నారు.
ఇది ఇలా ఉండగా విద్యార్థులు నిత్యం అవసరాల కోసం వాడుకునే వాటర్ ట్యాప్ ల వద్ద పాకూరు పేరుకుపోయి ప్రమాదకరంగా మారాయి దానిని పాటించుకున్న లేదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాలను,భవిష్యత్తును గాలికి వదిలేస్తు పిల్లలకు పాఠాలు చెప్పడంలో కంటే ఇతర విషయాలపైనే మక్కువ చూపిస్తున్నారు. విద్యార్థులకు సమయానికి అన్ని వసతులు చేకూరేలా చూడాల్సిన ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ కు సహకారాలు అందించుకుంటూ విద్యార్థుల ఆరోగ్యాలను భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.
అయితే వాటర్ ట్యాంక్ సమయానికి శుభ్రము చేయకపోగా వాటర్ ట్యాంక్ లో ప్రమాదకర స్థాయిలో నాచు పేరుకుపోయి నీళ్లు అశుభ్రంగా మారాయని సమాచారం. ఇద్దరు మహిళా అటెండర్లు, ఇద్దరు మహిళా వాచ్మెన్లు మొత్తం నలుగురు మహిళా వర్కర్లు ఉనారు అయితే పై అధికారులకు తెలియకుండా ప్రిన్సిపల్ అండదండలతో మార్చ్ నెల నుండి ఒక వర్కర్ విధులకు హాజరు కాకుండా తన భర్తతో రిజిస్టర్లో నకిలీ సంతకాలు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయం గురించి పై అధికారులను వివరణ కోరగా మాకు ఈ విషయం పై ఎటువంటి సమాచారం లేదు అంటూ బదులిస్తున్నారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
Social Welfare Girls Hostelని పట్టించుకోని ఉన్నతాధికారులు

ఇంత జరుగుతున్నా కానీ ఉన్నతాధికారులు మాత్రం Social Welfare Girls Hostelని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అధికారులు ఎంత మంది మారినా, ఎన్ని కథనాలు ప్రచురితమైనా కానీ వారిలో అసలు చలనమే లేకపోవడం గమనార్హం. తల్లిదండ్రులకు భారం కాకూడదని వసతులు లేకున్న దు:ఖాన్ని పంటి బిగువున దాచుకుంటూ అమ్మాయిలు ఉజ్వల భవిష్యత్తు కోసమని నానా తంటాలు పడుతున్నారు. ఇకనైనా అధికారుల్లో చలనం వస్తుందోమో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: https://site.singidinews.com/govt-school-teachers-but-no-learning/















