- దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
నర్సంపేట ఆగస్టు 18 (సింగిడి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా.. మరోవైపు దివంగత మాజీ ఎమ్మెల్యే Peddi Sudharshan Reddy విగ్రహం తొలగింపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నెలకొంది ఒక పార్టీలో సందడి.. మరో పార్టీలో నిరసనల వేడి నెలకొనడంతో నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి ఎమ్మార్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తున్నట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
పోలీసుల పహారా నడుమ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మంగళవారం వేకువజామున తొలగించారు . మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పోలీసు పహారా మధ్య అత్యంత గోప్యంగా అక్కడి నుంచి తరలించారు. విగ్రహం కోసం నిర్మించిన గద్దెను పూర్తిగా కూల్చివేసి, సిమెంట్ ఇటుకలు, శిథిలాలను సైతం అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. అయితే విగ్రహం తొలగింపునకు అర్ధరాత్రి నుంచే కదలికలు మొదలైనట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జేసీబీ సాయంతో విగ్రహం ఉన్న ప్రదేశంలో పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఫోన్లు వినియోగించకుండా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.విషయం తెలుసుకొని అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. గద్దె కూల్చివేతతో మొదలైన వివాదం పెద్ది సుదర్శన్‌రెడ్డి జులై 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
తప్పుల తడకగా ‘సర్’ జాబితా: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Peddi Sudharshan Reddy విగ్రహం కోసం బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా..
ఆయన దశదినకర్మ సందర్భంగా మెడికల్ కళాశాల సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం గద్దె నిర్మించారు. ఆ భూమి అసైన్డ్ భూమి అనే చర్చ కూడా అప్పట్లో సాగింది. మున్సిపల్ అనుమతులు లేవంటూ అధికారులు తొలుత గద్దెను కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేడ్కర్ సెంటర్లో ధర్నాకు దిగాయి. అదే రోజు సాయంత్రం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట పట్టణ యూత్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాయిడి దుష్యంత్ రెడ్డి తో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: https://site.singidinews.com/green-city-venture-fraud-plot-buyers/















