- రేవల్లి పోలీసుల పక్షపాత వైఖరిపై మాజీ జడ్పీటీసీ భీమయ్య ఆగ్రహం
- సామాన్యుల పట్ల ఒకలా.. కాంగ్రెస్ నేతలతో మరోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు
రేవల్లి, ఆగస్టు 25 (సింగిడి): Revalli Police Station ప్రజల కోసం కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ కోసం ఊడిగం చేస్తోందని, స్టేషన్ బోర్డును ‘కాంగ్రెస్ రేవల్లి పోలీస్ స్టేషన్’ గా మార్చుకుంటే బాగుంటుందని మాజీ జడ్పీటీసీ భీమయ్య ఘాటుగా విమర్శించారు. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవలను ప్రెస్ నోట్ ద్వారా బహిర్గతం చేసి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన పోలీసులు.. తమను తామే న్యాయవాదులు, జడ్జీలుగా భావిస్తున్నారా అని నిలదీశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై నమోదైన తీవ్రమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా దాచిపెట్టి, కుటుంబ సమస్యలను మాత్రం ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై వివరణ కోరేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేస్తే ఎస్ఐ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తే, మామూలు జనాలు ఫోన్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మండిపడ్డారు. పక్షపాతంతో వ్యవహరిస్తూ కుటుంబాల విషయంలో రేవల్లి పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సో‘షేమ్’ మీడియా: https://epaper.singidinews.com/view/99/telangana-main
Revalli Police Station మరీ ఇలానా..

రేవల్లి పోలీస్ స్టేషన్ ను ఇలా ఎప్పుడూ చూడలేదని, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఇదే తొలిసారని మాజీ జడ్పీటీసీ భీమయ్య ఆరోపించారు. అసలు ఏ విషయం అయినా కానీ పోలీసులు వ్యవహరించే తీరు చూస్తుంటే విస్మయం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోలీసులు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా అని ఆయన ప్రశ్నించారు.
మత్తు రహిత రేవల్లి దిశగా అడుగులుపడేదెప్పుడు: https://site.singidinews.com/drug-free-revalli-steps-towards-drug-free-area/













