Share
  • ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి
  • డీజే లు, అధిక శబ్దంతో కూడిన లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు
  • జిల్లా ఎస్పీ డి.సునీత రెడ్డి ఆదేశం

వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 13(సింగిడి): వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి అని (Wanaparthy Ganesh Mandapam Rules), ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.సునీత రెడ్డి ఆదేశించారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వనపర్తి జిల్లా పరిధిలో గణేష్ మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖకు సమాచారం అందించి అనుమతి పొందాలని ఎస్పీ కోరారు. వినాయక చవితి భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పోలీస్ పోర్టల్ ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తుదారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు (Wanaparthy Ganesh Mandapam Rules) అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని కోరారు. వనపర్తి జిల్లాలోని పట్టణాలలో, గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. (Wanaparthy Ganesh Mandapam Rules) ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు.

నేటి నుంచే అఫ్ఘన్‌తో టీ20లు షురూ: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Wanaparthy Ganesh Mandapam Rules

Wanaparthy Ganesh Mandapam Rules: అనుమతులు తీసుకోవాలి

మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలని, గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపంలో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనంను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని అన్నారు. మండపాల దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని చెప్పారు.

పోలీస్ జాబే మీ లక్ష్యమా: https://site.singidinews.com/free-police-training-si-constable/
ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె. లకు అనుమతి లేదని అన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీసు యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని, వెంటనే డయల్ 100 లేదా 112 కు సంప్రదించాలని ఎస్పీ సునీత రెడ్డి సూచించారు

Share