Share
  • డెంగ్యూ కేసు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
  • ప్రజల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి
  • వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 18 (సింగిడి): Wanaparthy Collector డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో పర్యటించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాలను పరిశీలించారు. కాలనీలో ఇటీవల డెంగ్యూ కేసు నమోదైన ఇంటిని కలెక్టర్ సందర్శించి పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.డెంగ్యూ కేసు నమోదైన ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న నీటి నిల్వలు, ఇంటి పరిసరాలు, డ్రైనేజీ పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కాలనీలోని ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ అవసరమైన చోట్ల ప్రజల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఆటోలు నడుపుతున్న మైనర్ బాలురు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Wanaparthy Collector
డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమైన దోమల నియంత్రణకు నీరు నిల్వ ఉండకుండా చూడటం, నిల్వ ఉన్న నీటిని తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, లార్వా నియంత్రణ చర్యలు చేపట్టడం వంటి చర్యలను నిరంతరం చేపట్టాలని Wanaparthy Collector అధికారులను ఆదేశించారు. జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వనపర్తి పట్టణంలో డ్రైడే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. వారానికి ఒక రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు పరిసరాల్లో నీటి నిల్వలను గుర్తించి తొలగించే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని సూచించారు.
ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దోమల లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

SIR నోటీసులొస్తే ఇలా చేయండి: https://site.singidinews.com/wanaparthy-sir-voter-list-revision/

Wanaparthy Collector

నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్న Wanaparthy Collector

ప్రజలు కూడా తమ ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని కలెక్టర్ కోరారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

 

Share