- సంబంధిత పత్రాలతో విచారణకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచన
- ఓటర్లకు అవగాహన కల్పించాలి.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచన
- ఫారం 6, 7, 8లకు 2,177 దరఖాస్తులు
వనపర్తి (సింగిడి): SIR Voter List Revisionకు సంబంధించి వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఓటర్లకు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్ లేదా ఇతర అనామలీస్ కేటగిరీలకు సంబంధించి నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలన్నారు.
బుధవారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్‌లో SIR ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, పత్రాల సమర్పణ తదితర అంశాలపై ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. (SIR Voter List Revision) విచారణకు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించిన ఓటర్ల వివరాలను పరిశీలించి తుది ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
DGP మంచి కాఫీ లాంటోడో కానీ: https://epaper.singidinews.com/clip/1748
SIR Voter List Revisionలో మొత్తం 2 వేలకు పైచిలుకు దరఖాస్తులు

ఇటీవల రెండు దఫాలుగా నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమంలో ఫారం-6, ఫారం-7, ఫారం-8లకు సంబంధించి మొత్తం 2,177 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, ఓటర్ల వివరాల్లో మార్పులు, చిరునామా సవరణలకు సంబంధించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.SIR ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వననర్తి ఆర్టీసీ డిపో ముందు SWF ధర్నా: https://site.singidinews.com/swf-protest-on-rtc-workers-problems/















