Share
  • కంపచెట్లతో రోడ్డు ఆనవాళ్లు మాయం
  • పాములు ఇళ్లలోకి వస్తున్నా పట్టించుకోని అధికారులు
  • సమస్యను ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసుల విజ్ఞప్తి

రేవల్లి సెప్టెంబర్ 15 (సింగిడి): వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని 6వ వార్డులో (Revalli 6th Ward) దాసరి కృష్ణయ్య ఇంటి సమీపంలోని ప్రధాన రహదారి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు కంపచెట్లు విపరీతంగా పెరిగి రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో విషసర్పాలు, ఇతర పాములు ఇళ్ల ఆవరణల్లోకి, కొన్నిసార్లు ఇళ్లలోకి కూడా వస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Revalli 6th Ward: బయటకు రావాలంటే జంకుతున్న వైనం..

Revalli 6th Ward Revalli 6th Ward

దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాలనీలో విద్యుత్ సౌకర్యం కూడా సక్రమంగా లేకపోవడంతో రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై 6వ వార్డు మెంబర్ తప్పట రాములు గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యపై అధికారులు ఇకనైనా స్పందించి రహదారిపై పేరుకుపోయిన చెత్తను తొలగించి, కంపచెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: https://site.singidinews.com/free-police-training-si-constable/

Share