Share
  • సంప్రదాయబద్ధంగా గణనాథుని లడ్డూ వేలం.. రూ.82 వేలకు దక్కించుకున్న సిబ్బంది
  • భజనలు, బాజాభజంత్రీలు, కోలాటాలతో ఘనంగా గణేశుడి ఊరేగింపు
  • శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించడంలో పోలీసుల సమన్వయం అభినందనీయం

వనపర్తి, సెప్టెంబర్ 16 (సింగిడి): Wanaparthy Police Ganesh Immersion కన్నుల పండువగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొలువుదీరిన పోలీసు ‘సురక్ష’ గణనాథునికి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో గణనాథునికి పూజలు నిర్వహించిన అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించారు.

వనపర్తి జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

 

Wanaparthy Police Ganesh Immersion: ఆసక్తిగా లడ్డూ వేలంపాట

Wanaparthy Police Ganesh Immersion Wanaparthy Police Ganesh Immersion Wanaparthy Police Ganesh Immersion

పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనగా పెద్ద లడ్డూ రూ.61 వేలకు, చిన్న లడ్డూ రూ.21 వేలకు వేలం వెళ్లింది.అనంతరం భజనలు, బాజాభజంత్రీలు, కోలాటాలు, జై గణేశ్ నినాదాల మధ్య గణనాథుని ఊరేగింపు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎస్పీ సునిత రెడ్డి మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో వనపర్తి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను భక్తితో పాటు బాధ్యత, క్రమశిక్షణ, పరస్పర సహకారంతో నిర్వహించాలని సూచించారు. ప్రజల భక్తి భావాలను గౌరవిస్తూ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రాణి రుద్రమ రెడ్డి బ్యాటింగ్ మామూలుగా లేదుగా: https://site.singidinews.com/rani-rudrama-telangana-liberation-day-demand/

Share