Share
  • నిర్లక్ష్యమే కొంపముంచిందా!
  • ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాలను మింగిన వైనం

రేవల్లి, ఆగస్టు 23 (సింగిడి): రేవల్లి మండల పరిధిలోని తల్పునూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి (Tractor Accident) 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తల్పునూర్‌కు చెందిన యనమోని కృష్ణ షబ్బీర్ పొలంలో ట్రాక్టర్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల సాయికుమార్‌ను ట్రాక్టర్ ఇంజిన్‌పై ఎక్కించుకుని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న సాయికుమార్ పొలంలోని బురదలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యనమోని కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రజిత తెలిపారు. మృతదేహానికి రేవల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో దోమల టవర్స్: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Tractor Accidentకు అజాగ్రత్తే కారణమా..

16 ఏండ్ల సాయికుమార్ ఇలా ప్రమాదంలో చనిపోవడానికి నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తోంది.  ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి మైనర్ బాలుడిని ఎక్కించుకుని నిర్లక్ష్యం వహించినట్టు చూస్తే అర్థం అవుతోంది. ఇందులో తప్పులు ఎవరివి అని వెతికినా ఎటువంటి ప్రయోజనం లభించదు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా మరో ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

తెలంగాణలో కొత్త ప్రెస్ క్లబ్: https://site.singidinews.com/federation-of-press-clubs-launched-by-bhatti/

Share