Share
  • అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం…
  • నివాస స్థలంలో కమర్షియల్ బిల్డింగ్…
  • నిమ్మకు నీరెక్కినట్లుగా మున్సిపల్ అధికారులు…..!

నర్సంపేట, అక్టోబర్ 05 (సింగిడి): వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో Narsampet Illegal Constructionపై అంతా పెదవి విరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. నివాస గృహాల నిర్మాణాల కోసం మున్సిపాలిటీ అనుమతులు పొంది, ఆ స్థలంలో భారీ వాణిజ్య భవనాలను (Commercial Buildings) నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది సెట్‌బ్యాక్‌లు (నిర్దేశిత స్థలం) వదలకుండా, పార్కింగ్ వసతి లేకుండా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ నిర్మాణాలు సాగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

narsampet-illegal-construction narsampet-illegal-construction

Narsampet Illegal Construction: నిమ్మకు నీరెత్తినట్లుగా మున్సిపల్ అధికారులు

narsampet-illegal-construction

కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం పై మున్సిపల్ ధికారులకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అక్రమార్కులకు, అధికారులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాల వల్లే ఈ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.

దొంతిని అంటే నాలుకలు కత్తిరిస్తాం: https://site.singidinews.com/statue-controversy-donthi-comments-warning/

స్థానికుల డిమాండ్

Narsampet Illegal Construction లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు,నగర ప్రణాళిక లోపాలు తలెత్తుతాయని ఇంకా ఇలాంటి అక్రమార్కులు పుట్టగొడుగుల పుట్టుకొస్తారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, బాధ్యులైన అక్రమార్కులపై వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి గోపాల్‌పేట మండలాల్లో ప్రజావాణికి 8 ఫిర్యాదులు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i/742

Share