Share
  • డిఈఓ అనుమతి లేకుండా పాఠశాలలో అనుమతించను ప్రిన్సిపాల్
  • సంఘటన వెలుగులో రాకుండా ప్రయత్నించిన పాఠశాల సిబ్బంది?

మోతే, సింగిడి: మండలం కేంద్రం లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (KGBV)లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రవిపహాడ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి సేవించి ప్రహరీ గోడ దూకి వసతి గృహంలోకి ప్రవేశించి ఓ మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో పాఠశాల భద్రతపై ప్రశ్నలు తలెత్తగా, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
ఘటన అనంతరం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వకుండా అంతర్గతంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన అంతా జరగడానికి గల కారణాలు స్థానికంగా మండలానికి చెందిన వంట మనుషులు స్కావెంజర్లు అటెండర్లు ఉండడంతోనే వారి సెల్ఫోన్లతోని విచ్చలవిడిగా విద్యార్థినిలు సెల్ ఫోన్లు ఇవ్వడంతోనే ఈ సంఘటనలు జరిగాయనే చర్చ జరుగుతుంది.

KGBV భద్రతలో లోపాల వల్లే ఈ ఘటన: స్థానికులు

రాత్రి వేళల్లో ఓ వ్యక్తి సులభంగా KGBV పాఠశాల ఆవరణలోకి ప్రవేశించే పరిస్థితి ఎలా ఏర్పడిందని ప్రశ్నిస్తున్నారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినుల రక్షణకు తగిన భద్రతా చర్యలు అమలు చేశారా లేదా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు….

Read Now: https://site.singidinews.com/singareni-odisha-coal-supply-to-telangana/

 

Share