- గ్రీన్ సిటీ వెంచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
- అభివృద్ధి పేరుతో కొనుగోలుదారులను మోసం చేసిన వెంచర్ నిర్వాకుడు
డోర్నకల్/మరిపెడ (సింగిడి): తమ జీవితకాల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి Venture లలో ప్లాట్లను కొనుగోలు చేస్తే మోసం చేశారని బాధితులు మీడియా సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బయ్య పాలెం గ్రామపంచాయతీ పరిధిలో గ్రీన్ సిటీ పేరుతో Venture ను ఏర్పాటు చేసిన చుండ్రు రాజ్ కుమార్ ప్లాట్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనేక అభివృద్ధి పనులు చూపించి,ప్లాట్ ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా కొనుగోలుదారులుగా మోసపోయామని బాధితులు తమ గోడును వెల్లిబుచ్చుకున్నారు.
ప్లాట్ అమ్మకం దారుడు చుండ్రు రాజ్ కుమార్ బ్రోచర్లలో ప్లాట్ కు పహరి గోడ నిర్మిస్తామని, విద్యుత్ సౌకర్యం,చిల్డ్రన్ పార్క్,స్ట్రీట్ లైట్,ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్లాట్ కొనుగోలుదారులను మోసం చేశారన్నారు. తమ జీవితకాల కష్టాన్ని ధారగా పోసి గ్రీన్ సిటీ వెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేసినందుకు దారుణంగా మోసపోయామన్నారు. కొనుగోలుదారుల నుండి పూర్తి పైసలు కట్టించుకొని ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎవరు మోసపోరని,అబద్ధపు మాటలు చెప్పి ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత మాకేమీ తెలియనట్టుగా మోసం చేసి గ్రీన్ సిటీ వెంచర్ నిర్వాకుడు చుండ్రు రాజకుమార్ వెళ్లిపోయారని,తమ ఫోన్లను కూడా సమాధానం చెప్పడం లేదన్నారు.
Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
ఆ venture నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

గ్రీన్ సిటీ వెంచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు.. వెంచర్ బాధితులు కేలోత్ బిక్షపతి బిల్యా నాయక్ తండ కాంపల్లి,కేలోత్ లచ్చిరాం బిల్యా నాయక్ తండా కాంపల్లి,మాలోత్ ప్రతాప్ సింగ్ మాంజ్య తండా ఎడ్జెర్ల,బోడ వెంకన్న బిల్యా నాయక్ తండ,మాలోత్ కిరణ్ ఏడ్చర్ల,చాపల సుభద్ర కోటగడ్డ బయ్యారం, మిడతపల్లి నరసింహారావు రఘునాథ్ పాలెం, గండు మల్లయ్య రఘునాథపాలెం బాధితులు తమకు న్యాయం చేయాలని, గ్రీన్ సిటీ వెంచర్ నిర్వాహకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: https://site.singidinews.com/cpi-modi-govt-corporate-forces-allegations/















