- ‘సింగిడి’ కథనంతో అధికారుల్లో చలనం
- ‘సింగిడి’కి ధన్యవాదాలు తెలుపుతున్న గ్రామస్తులు
రేవల్లి ఆగస్టు 29 (సింగిడి): వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని బండరాయిపాకుల గ్రామంలోని మోరీలో చెత్త పేరుకుపోయిన సమస్యపై ‘సింగిడి’ (Singidi News)లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీఎస్పీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు మోరీని శుభ్రం చేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ మోరీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్‌ను కూడా వెంటనే సరిచేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు.
తగ్గిన బంగారం ధరలు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
‘Singidi News’కి ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

మోరీ సమస్య వల్ల ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదని, ‘సింగిడి’ చొరవ తీసుకుని కథనం ప్రచురించడంతో తమ సమస్య పరిష్కారం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామని ఆ సమయంలో ‘సింగిడి’ చొరవ అభినందనీయమని అన్నారు. సమస్యను నలుగురికీ తెలిసేలా చేసి పరిష్కారానికి కృషి చేసిన ‘సింగిడి’కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ‘సింగిడి’ ప్రతినిధులు స్పష్టం చేశారు.
‘వనపర్తి కలెక్టర్‌ను బర్తరఫ్ చేయాలి’: https://site.singidinews.com/wanaparthy-collector-dismissal-demand/
సింగిడి ప్రచురించిన కథనం
ఈ నెల 28వ తేదీన సింగిడి ‘బండరాయిపాకుల పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి’ అనే పేరుతో కథనం ప్రచురించింది. ఈ కథనం స్థానికంగా సంచలనం కావడంతో వెంటనే స్పందించిన కార్యవర్గం, అధికార గణం మోరీని సాఫ్ చేయించారు. ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తున్న సమస్యకు సింగిడి ఒకే రోజులో పరిష్కారం చూపడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.















