Share
  • 53 డివిజన్ ఇన్చార్జ్ ముద్దంగుల మహేష్ ఆధ్వర్యంలో నిరసన
  • కదిలిన యంత్రాంగం..
  • గణేష్ టెంపుల్ రహదారి మరమ్మతులు ప్రారంభం
  • బిఆర్ఎస్ నిరసనతో స్పందించిన అధికారులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

కొత్తగూడెం, ఆగస్టు 6 (సింగిడి): అధికారంలో (BRS Protest) ఉంటేనే కాదు, అధికారం లేకపోయినా ప్రజల సమస్యలను తమ బాధ్యతగా భావించి వాటి పరిష్కారం కోసం పోరాడడమే నిజమైన ప్రజాసేవ అని మరోసారి నిరూపితమైంది. కొత్తగూడెం పురపాలక పరిధిలోని 53వ డివిజన్ పరిధిలోని గణేష్ టెంపుల్ నుండి ప్రగతి నగర్ గొల్లగూడెం వెళ్లే రహదారి తీవ్ర దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్‌ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఆ డివిజన్ బిఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దంగుల మహేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి దశల వారీగా నిరసనలు తెలియజేసి సమస్యకు పరిష్కారం చూపారు.

​ ప్రజా సమస్యపై గళమెత్తిన బీఆర్‌ఎస్..

గత కొన్ని రోజులుగా గుంతలు పడి అధ్వానంగా తయారైన ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించిన బీఆర్‌ఎస్ పార్టీ 53వ డివిజన్ ఇన్‌చార్జ్, కోఆర్డినేటర్ ముద్దంగుల మహేష్ నాయకత్వంలో అనేకసార్లు స్థానికులతో కలిసి ప్రత్యక్ష నిరసన తెలిపారు. ప్రజా సమస్యను తీవ్రంగా పరిగణించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగంలో చలనం వచ్చింది.

Join Our WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

​ చకచకా సాగుతున్న రోడ్డు మరమ్మతులు..

BRS Protest

బీఆర్‌ఎస్ నాయకుల పోరాటానికి (BRS Protest), ప్రజా నిరసనకు దిగివచ్చిన సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు. సదరు రహదారిపై గుంతలను పూడ్చి, కంకర (మెటల్) వేసి రహదారి పునరుద్ధరణ పనులను గురువారం ఉదయం నుంచే వేగవంతంగా ప్రారంభించారు. గుంతలతో నిండిన రహదారి ప్రయాణానికి అనుకూలంగా మారుతుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: https://site.singidinews.com/acharya-jayashankar-telangana-father/

​ ప్రజా సమస్యలపై పోరాటం నిరంతరం: ముద్దంగుల మహేష్

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ 53వ డివిజన్ ఇన్‌చార్జ్ ముద్దంగుల మహేష్ మాట్లాడుతూ… “అధికారంలో ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన ధ్యేయం. అధికారం లేకున్నా ప్రజల తరఫున పోరాడి పనులు చేయించే సత్తా ఒక్క బీఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల నమ్మకమే మా బలం.. ప్రజా సేవే మా ఆశయం. రాబోయే రోజుల్లో కూడా డివిజన్‌లోని ప్రతి ప్రజా సమస్యపై మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

Share