- రైతన్నల కష్టాలపై డీలర్ల దందా?
- ఉమ్మడి గోపాల్పేట మండలాల్లో రైతులను కలవరపెడుతున్న విత్తనాల వ్యవహారం
- గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలపై ఆరోపణలు..
- నష్టాల ఊబిలో రైతన్నలు.. కాసుల కోసం కొందరు డీలర్ల దందా సాగుతోందా?
- అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
రేవల్లి, సెప్టెంబర్ 6 (సింగిడి): ఉమ్మడి గోపాల్పేట్ మండలంతో పాటు వననపర్తి జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్పేట్ మండలాల పరిధిలో (Fake Seeds in Gopalpet) నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి మండల పరిధిలోని గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాలతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న కొన్ని ఫర్టిలైజర్, విత్తనాల దుకాణాల్లో నాణ్యతలేని లేదా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు సమగ్ర విచారణ జరగకపోవడంతో రైతుల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. (Fake Seeds in Gopalpet) వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సీజన్లో పంటలపై ఆశలు పెట్టుకుని భారీ పెట్టుబడులు పెడుతున్నారు.
విత్తనం నుంచి ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటి ఖర్చులు వరకు అన్నింటికీ వేలాది రూపాయలు వెచ్చిస్తున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు అందకపోతే వారి మొత్తం పెట్టుబడి నీటిపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పంట సాగు సమయంలో రైతులు ఎక్కువగా స్థానిక ఫర్టిలైజర్ దుకాణాలపైనే ఆధారపడుతున్నారు. తమకు అవసరమైన విత్తనాలను డీలర్లు సూచించిన విధంగానే కొనుగోలు చేస్తున్న రైతులు, విత్తనాల నాణ్యతను పూర్తిస్థాయిలో నిర్ధారించుకునే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విత్తనం కొనుగోలు చేసిన తర్వాత పొలంలో వేసిన అనంతరం మొలక శాతం తక్కువగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఆశించిన విధంగా ఎదగకపోవడం, దిగుబడిపై ప్రభావం పడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Fake Seeds in Gopalpet అధికారులారా జర సూడుర్రి..

అయితే ఈ సమస్యలకు విత్తనాల నాణ్యతే కారణమా (Fake Seeds in Gopalpet) లేక ఇతర వ్యవసాయ పరిస్థితుల ప్రభావమా అనే అంశంపై సంబంధిత శాఖలు శాస్త్రీయంగా పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.ఇప్పటికే వ్యవసాయం రైతుకు భారంగా మారుతున్న తరుణంలో నకిలీ లేదా నాణ్యతలేని విత్తనాల సమస్య వస్తే రైతు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఒక పంట కోసం రైతు విత్తనాలు కొనుగోలు చేయడం నుంచి సాగు పూర్తయ్యే వరకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సొంతంగా డబ్బులు లేకపోతే అప్పులు చేసి, వడ్డీలకు డబ్బులు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులు పంటలో నష్టం వస్తే తిరిగి అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరుకుంటున్నారు.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, అధిక వర్షాలు, చీడపీడల సమస్యలు రైతులను వెంటాడుతుండగా మరోవైపు విత్తనాల నాణ్యతపై అనుమానాలు రైతన్నలను కలవరపెడుతున్నాయి. పంట చేతికి వస్తుందనే ఆశతో చేసిన పెట్టుబడి వృథా అయితే రైతు కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడుతోంది.ఈ పరిస్థితిని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చుకుని కాసుల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైతులకు విత్తనాల గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండా, అధిక లాభాలు వచ్చే ఉత్పత్తులను విక్రయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విత్తనాల పేరుతో రైతులకు అనుమానాస్పద ఉత్పత్తులు విక్రయిస్తే ఆ నష్టం చివరకు రైతుదే అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
దుకాణదారులు ఇచ్చే బిల్లులు, విత్తనాల బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు, కంపెనీ వివరాలు, ప్రభుత్వ అనుమతులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రతి విత్తనాల దుకాణంలో ఉన్న నిల్వలను పరిశీలించి, అవసరమైతే నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపితేనే అసలు పరిస్థితి బయటపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. (Fake Seeds in Gopalpet)
అధికారులకు ఆమ్యామ్యాలు అందుతున్నాయా?

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫర్టిలైజర్, విత్తనాల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా? (Fake Seeds in Gopalpet) విక్రయిస్తున్న విత్తనాల నాణ్యతను పరిశీలిస్తున్నారా? రైతులకు సరైన ధరలకు, నాణ్యమైన ఉత్పత్తులు అందుతున్నాయా? నకిలీ విత్తనాల విక్రయాలపై వస్తున్న సమాచారాన్ని అధికారులు పరిశీలించారా? అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
కొందరు అధికారులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. రైతుల ఆరోపణల్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని రైతు వర్గాలు కోరుతున్నాయి. ఉమ్మడి గోపాల్పేట్ మండల పరిధిలోని గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని ఫర్టిలైజర్, విత్తనాల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి దుకాణంలో విక్రయిస్తున్న విత్తనాల వివరాలు, కొనుగోలు బిల్లులు, నిల్వలు, బ్యాచ్ నంబర్లు, కంపెనీ అనుమతులు తదితర అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. అనుమానాస్పదంగా ఉన్న విత్తనాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల విక్రయం జరిగినట్లు తేలితే బాధ్యులైన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. (Fake Seeds in Gopalpet)
YCPలోకి కొండా కుటుంబం?: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
అన్నదాతల ఆందోళన
రైతుల జీవితాలతో ఆటలాడే వారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి దందాలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. (Fake Seeds in Gopalpet) వ్యవసాయం అనేది రైతు కుటుంబానికి కేవలం వృత్తి మాత్రమే కాదు.. వారి జీవనాధారం. ఒక విత్తనం నాణ్యంగా లేకపోతే అది కేవలం పంటను మాత్రమే కాదు.. రైతు కుటుంబ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. అప్పులు చేసి సాగు చేసిన రైతుకు నష్టమే మిగిలితే అతని కష్టానికి బాధ్యులెవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకే ఉమ్మడి గోపాల్పేట్ మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలపై వస్తున్న సమాచారం, ఆరోపణలను సంబంధిత అధికారులు తీవ్రంగా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నిజానిజాలు తేల్చి, రైతులకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు గనుక రైతులు కొంటే వారు చెప్పరాని విధంగా నష్టపోతారు. ఇకనైనా అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అన్నదాతలకు అపార నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుకుంటున్నారు. మరి ఉమ్మడి మండలంలోని అధికారులు దీనిపై ఏం చేస్తారో ఇక వేచి చూడాలి.
ఎరుపెక్కిన కన్నారం: https://site.singidinews.com/aituc-telangana-state-conference-karimnagar/













