Share
  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
  • ఓటు హక్కు వినియోగించుకున్న 87 మంది
  • మడి శోభన్ ప్యానెల్ ఘన విజయం

ములుగు ప్రతినిధి, సెప్టెంబర్ 7 (సింగిడి): ములుగు జిల్లాలోని మంగపేట మండలం వాడగూడెంలో సోమవారం పగిడిద్దరా జు సమ్మక్క సారక్క గిరిజన ఇసుక క్వారీ లేబర్ (Sand Quarry Elections) కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్ రి.నెం.138 టియం పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు.మొత్తం 87 మంది ఓటర్ల 87 మంది హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 7 ఓట్లు తిరస్కరణకు గుర య్యాయి జనరల్ కేటగిరిలో 9 పాలకవర్గ స్థానాలకు 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా మహిళా రిజర్వు కేటగిరిలో 2 స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.జనరల్ కేటగిరిలో కుంజ యాకబ్రం (60), మడి శోభన్ బాబు (60), ముడ్డెం వెంకటేశ్వర్లు (60),మోకాళ్ల మూర్తి (60),బంగారు కేశవరావు (58), బంగారు దేవమ్మ (58), మడి నరసింహారావు (58),వాసం కృష్ణమూర్తి (58),పొలబోయిన రవ రాజు (57) అత్యధిక ఓట్లు సాధించి పాలకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.మహిళా రిజర్వు కేటగిరిలో బడి విజయ (59), మడి ఈశ్వరి (59) అత్యధిక ఓట్లు సాధించి పాలకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

మరోమారు ‘సర్’ గడువు పొడగింపు:  https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Sand Quarry Electionsదీంతో జనరల్ కేటగిరిలో 9 మంది,మహిళా రిజర్వు కేటగిరిలో ఇద్దరు కలిపి మొత్తం 11 మంది పాలకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ములుగు జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్‌స్పెక్టర్,ఎన్నికల అధికారి మాటూరి రాజేష్ పర్యవేక్షించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎం.చంద్రశేఖర్, పోలింగ్ అధికారులుగా ఆర్.వి.వి. సత్యనారాయణ,సోమ సత్యనారాయణ,తోట పూర్ణ,పూజారి రమేష్, పోలింగ్ క్లర్క్‌గా సంతోష్ విధులు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగి సేందుకు ఎస్ఐ సూరి,సెకండ్ ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. (Sand Quarry Elections)

అంధకారంలో మల్లూరు గ్రామం: https://site.singidinews.com/mallur-village-street-lights-problem/

Share