Share
  • పార్టీ ఫ్లెక్సీల తరలింపునకు మున్సిపల్ ట్రాక్టర్‌ వినియోగం..
  • మేయర్ ఆదేశాలు.. సిబ్బందితో అధికారులు చాకిరి
  • ట్రాక్టర్లో సిపిఐ ఆఫీసుకు తరలించడంపై వివాదాస్పదం
  • సెలవులు అధికారులకు.. వర్కర్లకు మాత్రం తప్పని చాకిరి!!
  • అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

సుజాతనగర్ (కొత్తగూడెం), సెప్టెంబరు 04 (సింగిడి): కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందిని (Corporation Workers), వాహనాలను పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు శుక్రవారం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన కార్పొరేషన్‌ ట్రాక్టర్లను సీపీఐ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పార్టీ ఫ్లెక్సీలను కార్పొరేషన్‌ ట్రాక్టర్‌లో పార్టీ కార్యాలయానికి తరలిస్తున్న దృశ్యాలు సుజాతనగర్ లో కనిపించడంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వనరులు, మున్సిపల్‌ సిబ్బందిని వ్యక్తిగత లేదా పార్టీ అవసరాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సొంత పనులకు Corporation Workers?

Corporation Workers

మున్సిపల్‌ వర్కర్లను అధికారిక విధులతో పాటు వ్యక్తిగత పనులకు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “పని చెప్తే చేయడమే తప్ప.. మేము ఏమి చెప్పలేం” అంటూ కొంతమంది సిబ్బంది తమ పరిస్థితిని వెల్లడిస్తున్నట్లు సమాచారం. ప్రతిసారి ఇదే తంతుగా మున్సిపల్‌ వర్కర్లతో సొంత పనులు చేయించుకుంటూ, అందుకు సంబంధించిన ఖర్చులు మాత్రం మున్సిపల్‌ నిధుల నుంచి చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో “వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట” అన్నట్టుగా వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల పన్నులతో నిర్వహిస్తున్న మున్సిపల్‌ వనరులను రాజకీయ లేదా వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

ఖద్దరు క్రీ(నీ)డలో ఖాకీలు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

మేయర్ ఆదేశమట.. సిబ్బంది తో చాకిరి…!!

Corporation Workers

కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. అయితే సిపిఐ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను తీయాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశించడంతో వారు మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్ లో సిబ్బందితో సుజాతనగర్ లోని పార్టీ ఆఫీసుకి తరలించిన ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారుల తీరు పట్ల స్థానిక ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని, ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నాలుగు నెలల నుంచి పిల్లలకు ముక్కే లేదు: https://site.singidinews.com/jyotiba-phule-gurukul-school-nonveg-shortage/

Share