Share
  • మా నాయకుడికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే ఊరుకోం
  • బిఆర్ఎస్ నాయకులను ప్రజలే ఉడికించి కొడతారు
  • నాయకులకు గుర్తింపు కొరకే ఈ చిల్లర రాజకీయం
  • బీఆర్ఎస్ శవరాజకీయాలు మానుకోవాలి
  • ఉద్యమకారుల పట్ల మాకు గౌరవం ఉంది
  • పెద్ది క్యాంస విగ్రహాన్ని మేమే ఏర్పాటు చేస్తాం.
  • పర్మిషన్‌తో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే బాగుండు
  • టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్.

నర్సంపేట ఆగస్టు 20 ( సింగిడి ): పెద్ది సుదర్శన్ రెడ్డి Statue Controversyలోకి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని అనవసరంగా లాగుతున్నారని, తనది తప్పు లేకున్నా కానీ ఆయన పేరును బద్నాం చేస్తున్నారని, బీఆర్ఎస్ క్యాడర్ ఇలాగే చేస్తే ఎక్కడికక్కడ వారి నాలుకలు కత్తిరిస్తామని టిపిసిసి సభ్యులు పెండం రామానంద్ మీడియా ముఖంగా ఘాటుగా హెచ్చరికలు చేశారు. గురువారం నర్సంపేట లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డికి అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం హనుమకొండ రోహిణి ఆసుపత్రి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హుటాహుటిన హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ చోటామోటా నాయకులు తమ గుర్తింపు కొరకు పెద్ది విగ్రహ కూల్చివేతపై తప్పుడు ప్రచారాలు చేసి బిఆర్ఎస్ పార్టీలో నాయకులుగా ఎదగాలని చూస్తున్నారని,పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందాక నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపించిందని ఆరోపించారు. పెద్ది విగ్రహానికి ఎమ్మెల్యే మాధవ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, అది కేవలం అధికారుల నిర్ణయం అని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ తీసుకోకుండా నామమాత్రపు విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేసి రాద్ధాంతం చేయడం సరైనది కాదన్నారు.

సీఎంను తిట్టిన సుష్మిత, కొండా సురేఖ క్లారిటీ: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Statue Controversyలో అది సరికాదు బిడ్డా

Statue Controversy

మీరు చేసిన తప్పుకు మాధవరెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టడం శవయాత్రలు చేయడం సరైనది కాదని, మీ బిఆర్ఎస్ వాళ్లకు చేతకాకపోతే మాకు చెప్పండి మేమే తలా కొంత డబ్బులు వేసుకొని పెద్ది క్యాంస విగ్రహాన్ని (Statue Controversy) ప్రధాన రహదారిపై ఏర్పాటు చేస్తామని అన్నారు. గత 10 సంవత్సరాల మీ ప్రభుత్వంలో స్థానికంగా మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కరి చిట్టా బయటికి తీస్తామని మీరు రోడ్లమీద తిరగకుండా మహిళలు, యువకులు, సంఘటిత ప్రజలు, ఉద్యమకారులు బుద్ధి చెబుతారని ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు. పై విషయాలు గుర్తుంచుకొని మసలుకోవాలని హెచ్చరించారు.

మిషన్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్స్: https://site.singidinews.com/tg-cm-mission-investments-start-telangana/

Share