Share
  • ఇష్టారాజ్యంగా మెనూ అమలు
  • విద్యార్థుల బియ్యాన్ని అమ్ముకుంటున్న వైనం
  • మొక్కలపై చేయి వేస్తే విద్యార్థులపై రూ.500 జరిమానా?
  • టేకులపల్లిలో ఉండాల్సిన గురుకుల పాఠశాలను ఖమ్మంలో నిర్వహించడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
  • పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం

కొత్తగూడెం, సెప్టెంబరు 03 (సింగిడి): బిసి గురుకుల పాఠశాల అయిన Jyotiba Phule Gurukul Schoolలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం పెట్టాల్సిన చికెన్, మటన్ ను నాలుగు నెలలుగా విద్యార్థులకు పెట్టడం లేదని, మెనూ సైతం ఇష్టానుసారంగా పెడుతున్నారని, విద్యార్థుల కడుపు మాడ్చి వారికి వచ్చే బియ్యాన్ని సైతం అమ్ముతున్నారని, పాఠశాలలో మొక్కలపై చేయి వేస్తే విద్యార్థులపై రూ.500 జరిమానా విధించడం విడ్డూరంగా ఉందని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు బుర్రా వీరభద్రం ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వహించాల్సిన ఇల్లందు డివిజన్‌కు చెందిన మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను ఖమ్మం జిల్లా కేంద్రంలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం అన్నారు.

టేకులపల్లి మండల కేంద్రంలో ఉండాల్సిన Jyotiba Phule Gurukul Schoolను ఖమ్మం పట్టణంలో నిర్వహించడం వల్ల పరిపాలనా పరంగా తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఈ గురుకులం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు డివిజన్ పరిధికి సంబంధించినదైనా ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తుండటంతో ఖమ్మం జిల్లా అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై ఎవరిని సంప్రదించాలి, ఏ అధికారి బాధ్యత వహించాలి అనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పరిపాలనా అసౌకర్యాన్ని ఆసరాగా చేసుకుని గురుకులంలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని బుర్ర వీరభద్రం పేర్కొన్నారు.

Jyotiba Phule Gurukul Schoolలో నాలుగు నెలలుగా ముక్క లేదు…

Jyotiba Phule Gurukul School

గత నాలుగు నెలలుగా విద్యార్థులకు మెనూలో భాగంగా అందించాల్సిన చికెన్, మటన్ అందించడం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాల్సిన గురుకులంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం తీవ్ర ఆందోళనకరమని తెలిపారు. విద్యార్థుల కోసం కేటాయించిన బియ్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆహారం, వసతులు, విద్యా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా పూల మొక్కను ముట్టుకున్నారనే కారణంతో విద్యార్థులపై రూ.500 జరిమానా విధించడం తీవ్రంగా ఖండించాల్సిన చర్య అని బుర్ర వీరభద్రం అన్నారు. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో భయపెట్టడం, ఆర్థిక భారం మోపడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

జరిమానాలు రద్దు చేయాలి

Jyotiba Phule Gurukul School విద్యార్థులపై విధించిన జరిమానాలను వెంటనే రద్దు చేసి, ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. టేకులపల్లి మండల కేంద్రంలో ఉండాల్సిన ఇల్లందు డివిజన్ గురుకుల పాఠశాలను ఖమ్మం పట్టణంలో కొనసాగించడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధికారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పరిపాలనా సౌలభ్యం, విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ దృష్ట్యా గురుకులాన్ని సంబంధిత ప్రాంతంలోనే నిర్వహించాలని బుర్ర వీరభద్రం డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందించాలని, గత నాలుగు నెలలుగా చికెన్, మటన్ ఎందుకు పెట్టలేదో విచారణ జరపాలని, బియ్యం అమ్ముతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.

రాజీనామా చెయ్… కొండా సురేఖకు అదిష్టానం ఆదేశాలు!: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Jyotiba Phule Gurukul Schoolను టేకులపల్లికి తరలించే విషయంపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి సంబంధిత అధికారుల కార్యాలయాలను ముట్టడించే స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుర్ర వీరభద్రం హెచ్చరించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తక్షణమే స్పందించి గురుకుల పాఠశాలను డివిజన్ కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

‘కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అలాగే ఉంటది’: https://site.singidinews.com/telangana-government-1000-days-thousand-lies/

Share