- వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లను పట్టించుకోని కమిషనర్, చైర్ పర్సన్..!
- బీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డులో అభివృద్ధి పనులకు బ్రేక్..?
- అభివృద్ధి పనుల్లో రాజకీయాలు పక్కన పెట్టాలి
- 22 వ వార్డు కౌన్సిలర్ ఏర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు ఆవేదన
వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (సింగిడి): బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న Wanaparthy 22nd Wardవార్డులో మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. కౌన్సిలర్ ఎన్నోసార్లు వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్, అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికంతటికి కారణం ఆ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి చెందడమే..ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు… వనపర్తి జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి క్యాంపు కార్యాలయం పరిధిలో ఉండేదే ఈ 22వ వార్డు… గత ఎన్నికల్లో ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా ఏర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందింది.

Wanaparthy 22nd Wardలో ఆమె గెలుపే ఓ సంచలనం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండే వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా ఆమె గెలుపొందడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అప్పటినుండి ఈ వార్డులో పనులు చేయొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వార్డులో ఎటువంటి సమస్య వచ్చిన ప్రజల వెంటే ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కౌన్సిలర్ తాపత్రయపడుతున్నది. కానీ మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్, అధికారులు సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఎన్నోసార్లు వార్డులో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఆమె తన బాధను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీకి చెందడం, పాలకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ చెందినవారు కావడంతోనే తనకు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i
కనీసం మురుగు కాలువలు కూడా శుభ్రం చేయట్లేదు

Wanaparthy 22nd Ward వార్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదని, మురుగు కాలువలను సకాలంలో శుభ్రం చేయడం లేదని కౌన్సిలర్ పేర్కొన్నారు. దీంతో కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో బుధవారం తన భర్త మెకానిక్ శ్రీనివాసులు స్వయంగా వార్డులోని శ్వేతా నగర్ కాలనీలో డ్రైనేజీలు శుభ్రం చేశారని, డ్రైనేజీలో పడిన రాళ్లను తొలగించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్నాయని, మురుగు కాలువలు శుభ్రం చేయకుంటే వార్డు ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆమె చెప్పారు.అలాగే వార్డులో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదని, చిన్నచిన్న మౌలిక వసతుల పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ వద్దకు తీసుకువస్తుండగా, అధికారులు మాత్రం పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని తమ బాధను వ్యక్తం చేశారు.
ఏదులలో ‘బెల్ట్’ తీయరా: https://site.singidinews.com/yedula-illegal-liquor-sales/
రాజకీయ ఇబ్బందులు కలిగించేందుకే ఇదంతా..

తనకు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే ఉద్దేశంతోనే Wanaparthy 22nd Wardలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని కౌన్సిలర్ విమర్శించారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలు పక్కన పెట్టాలని, ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వార్డులో గతంలో ప్రజల వెంట ఉండి సేవలు చేసినందుకే తమకు అవకాశం ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కౌన్సిలర్ ఏర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు కోరుతున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ ను వివరణ అడిగేందుకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.














