పెబ్బేరు, సెప్టెంబరు 9 (సింగిడి): పెబ్బేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుల పదవుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది (Pebbair BRS). పట్టణ పార్టీ అధ్యక్షుడిగా దిలీప్‌కుమార్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడిగా వనం రాములు కొనసాగుతున్నారని ఒక్క వర్గం పేర్కొంటుండగా వారి పదవీకాలం ఇప్పటికే ముగిసిపోయిందని మరో వర్గం వాదిస్తోంది. దీంతో పార్టీ పదవులపై స్పష్టత కొరవడిన పరిస్థితి నెలకొంది. పట్టణ పార్టీ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఇప్పటికీ అదే హోదాల్లో కొనసాగుతున్నామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను పట్టణ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనల మేరకు తాము తమ హోదాల్లో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వార్తల్లోనూ తమను అదే హోదాలతో పేర్కొనాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
పర‘కాల పరీక్ష’: https://epaper.singidinews.com/clip/1589
Pebbair BRSలో భిన్నవాదనలు

అయితే దీనికి భిన్నంగా పార్టీలోని కొందరు నాయకులు వాదిస్తున్నారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్షుల పదవీకాలం ఎప్పుడో ముగిసిపోయిందని వారు పేర్కొంటున్నారు. పదవీకాలం పూర్తయినప్పటికీ అదే హోదాలను ఉపయోగించుకోవడం సముచితం కాదని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పలువురు పార్టీ నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో తమను పార్టీ నాయకులుగానే పేర్కొంటున్నారని, పెబ్బేరు మండలంలో మాత్రం పదవీకాలం పూర్తయిన హోదాలను కొనసాగిస్తున్నట్లు చెప్పడం, వాటినే వార్తల్లో ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుల పదవులు ప్రస్తుతం అధికారికంగా కొనసాగుతున్నాయా? లేదా వారి పదవీకాలం ముగిసిందా? అనే అంశంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వార్తా కథనం ప్రచురణకు సంబంధించి పట్టణ పార్టీ అధ్యక్షుడు మీడియా ప్రతినిధులను ఫోన్లో సంప్రదించి తమ పదవులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ పదవులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు, నియామక ప్రకటనలు లేదా పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితేనే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఇరువర్గాల వాదనలు కొనసాగుతుండటంతో పెబ్బేరు బీఆర్ఎస్ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
BRS గెలిచిందని ఇలా చేస్తారా?: https://site.singidinews.com/wanaparthy-22nd-ward-development-issues/















