Share

నర్సంపేట సెప్టెంబర్ 10 (సింగిడి): రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత, కుల సమైక్యతను చాటేందుకే తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని (Journalism in Warangal, Hanamkonda) సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ తెలిపారు. వరంగల్(Journalism in Warangal, Hanamkonda) శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్యాన మందిరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఎన్నికల సమావేశం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూములూరి సత్యనారాయణ మాట్లాడుతూ… జర్నలిస్టులందరూ యూనియన్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలు పూర్తి చేసి, భారీ స్థాయిలో రాష్ట్ర మహాసభను నిర్వహిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి, ఐజేయూ జిల్లా కోశాధికారి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ మాట్లాడుతూ… నూతన కమిటీలు జర్నలిస్టుల సంక్షేమానికి, విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. (Journalism in Warangal, Hanamkonda) ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఓదెల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కలకోటి వీరభద్రయ్య చారి నిర్వహణకర్తలుగా వ్యవహరించారు.

MLA అక్కసు: https://site.singidinews.com/wanaparthy-22nd-ward-development-issues/

వరంగల్ జిల్లా నూతన కమిటీ..
అధ్యక్షుడిగా కుంటమల్ల అరవింద్, ప్రధాన కార్యదర్శిగా మునిగంటి అమరేందర్, ఉపాధ్యక్షుడిగా అకోజు సాంబయ్య, కోశాధికారిగా ఆర్.శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

హనుమకొండ జిల్లా కమిటీ

అధ్యక్షుడిగా ఉల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా దెంచనాల రాజు, కోశాధికారిగా పొడిచెట్టి రమేష్ ఎన్నికయ్యారు.(Journalism in Warangal, Hanamkonda) అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ ప్రమాణ స్వీకారం చేయించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండలోజు కృష్ణ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వడ్ల ప్రవీణ్ చారి, రాష్ట్ర కమిటీ సభ్యులు సర్వేశ్, ఆలయ కమిటీ అధ్యక్షులు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జి.పెంటయ్య చారి, సుగ్రీవ చారి, బ్రహ్మ చారి, శ్రీనివాస్, కిరణ్, మహేష్, శ్రవణ్, పూర్ణచందర్, గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

‘రేవంత్ రెడ్డివి పిల్ల చేష్టలు’: https://youtube.com/shorts/BJ1Bi2KWcXs?si=lkWdFApsvfYNY5zR

Share