- 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్
- డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన కార్మిక సంఘం
వనపర్తి, సెప్టెంబర్ 16 (సింగిడి): స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వనపర్తి ఆర్టీసీ డిపో ముందు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షుడు ఏజీ కృష్ణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాలని, రూట్ సర్వే నిర్వహించి అందుకు అనుగుణంగా టైమింగ్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలవెన్సులను 80 శాతం పెంచి తక్షణమే అమలు చేయాలని కోరారు.బ్రెడ్ విన్నర్ స్కీమ్‌లో నియమితులైన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ పోస్టింగులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతపై కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
నర్సంపేట మున్సిపాలిటీలో కుర్చీ చర్చ: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

SWF విలీన కమిటీ ఏర్పాటు చేయాలి
విలీన కమిటీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కార్మిక సంఘం నాయకులు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షుడు ఏ. కృష్ణయ్య, కార్యదర్శి ఎస్. వెంకటయ్య, రీజియన్ సహాయ కార్యదర్శి ఎం.డి. ఖయ్యూం, డిపో అధ్యక్షుడు కేజీ కృష్ణ, కార్యదర్శి సి. నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు నారాయణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు: https://site.singidinews.com/wanaparthy-police-ganesh-immersion/













