Share
  • అధికారిక సమాచారం లేదన్న ఎస్సై, సర్పంచ్

రేవల్లి ఆగస్టు 26 (సింగిడి): వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడి (Minor Sexual Assault Allegations) జరిగినట్లు సమాచారం. అనంతరం గ్రామంలో పంచాయితీ నిర్వహించి రూ.4 లక్షల జరిమానా విధించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. బాలికను గ్రామ శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు, విషయం గ్రామంలో తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు అందిందా? కేసు నమోదైందా? అనే విషయాలపై స్పష్టత లేదు.

Minor Sexual Assault Allegations గురించి పోలీసులకు సమాచారం లేదు!

Minor Sexual Assault Allegations విషయంపై రేవల్లి ఎస్సైని వివరణ కోరగా తమ వరకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని, విషయం తెలుసుకుంటామని తెలిపారు. ఇంత జరిగినా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. చీమ చిటుక్కుమన్నా తెలుసుకోవాల్సిన పోలీసులకు లైంగిక దాడి విషయం తెలియకపోవడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. చాలా మంది నోళ్లలో ఈ విషయం నానుతున్నా పోలీసులకు తెలియకపోవడం విడ్డూరం అని అంతా ఆశ్చర్యపోతున్నారు. రేపు ఒక వేళ ఏదైనా హత్య జరిగినా కూడా పోలీసులు ఇంతేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

US పర్యటనపై CM తప్పకుండా వివరణ ఇవ్వాలా?: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

ఫాఫం సర్పంచ్‌కూ తెలియదట..

Minor Sexual Assault Allegations

సంబంధిత గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా తనకు కూడా ఈ విషయం తెలియదని పేర్కొన్నారు. దీంతో ఘటనకు సంబంధించిన వాస్తవాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మైనర్‌కు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో అధికారిక నిర్ధారణ వచ్చే వరకు దీనిపై స్పష్టత లేనట్లే. పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

కాంగ్రెస్ పోలీస్ స్టేషన్‌గా మార్చుకోండి:https://site.singidinews.com/revalli-police-station-controversy/

Share