Share
  • సాగునీటికి రైతుల ఎదురుచూపులు!
  • చెరువులో నీరు ఉన్నా.. పొలాలకు అందని వైనం
  • కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఫైర్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో (సింగిడి): మంత్రి sridhar Babu సొంత నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలారం చెరువు నిండుకుండలా నీటితో కళకళలాడుతోంది. అయితే చెరువులో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మార్క రాము గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు నాయకులు పోలారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. చెరువు నిండా నీరు కళ్లముందే కనిపిస్తున్నా.. తమ పంటలకు మాత్రం సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్: https://site.singidinews.com/niranjan-reddy-criticizes-revanth-reddy/

నీరు అందుబాటులో ఉన్నా వదలరా sridhar Babu గారూ..

sridhar Babu

సాగుకు అవసరమైన నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, మండల నాయకులు విమర్శించారు. పంటలు ఎండిపోయే పరిస్థితి రాకముందే పోలారం చెరువు నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతుల సమస్యపై తక్షణమే స్పందించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. చెరువులో నీరు ఉన్నప్పటికీ సాగుకు వినియోగించుకోలేని పరిస్థితిపై అధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు: https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

2008లో ప్రారంభమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరును ప్రస్తావిస్తూ పలుమార్లు ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కొనసాగినప్పటికీ.. ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రాజెక్టు పేరును ఎన్నికల సమయంలో ప్రస్తావించడం కాకుండా రైతులకు వాస్తవంగా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకుంటే పోరాటమే పోలారం చెరువు నుంచి సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని, రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మార్క రాముగౌడ్ స్పష్టం చేశారు.

Share